Telugu Global
NEWS

Honda Cars Discounts | హోండా కార్స్ బంప‌రాఫ‌ర్‌.. ఆ రెండు కార్ల‌పై గ‌రిష్టంగా రూ.88,600 వ‌ర‌కూ డిస్కౌంట్లు.. ఈ నెలాఖ‌రు వ‌ర‌కే..

ఈ బెనిఫిట్ల‌తో పాటు న్యూ ఎలిగెంట్ ఎడిష‌న్ మిన‌హా అన్ని వేరియంట్ల‌పై హోండా కార్స్ స్పెష‌ల్ కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో రూ.20 వేల రాయితీ అందిస్తుంది.

Honda Cars Discounts | హోండా కార్స్ బంప‌రాఫ‌ర్‌.. ఆ రెండు కార్ల‌పై గ‌రిష్టంగా రూ.88,600 వ‌ర‌కూ డిస్కౌంట్లు.. ఈ నెలాఖ‌రు వ‌ర‌కే..
X

Honda Cars Discounts | జ‌పాన్‌కు చెందిన ప్ర‌ముఖ కార్ల త‌యారీ సంస్థ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) కొత్త సంవ‌త్స‌రంలో త‌న ఫ్లాగ్‌షిప్ మోడ‌ల్ కార్లు సిటీ (City), అమేజ్ (Amaze) సెడాన్‌ల‌పై భారీ డిస్కౌంట్లు ప్ర‌క‌టించింది. వేర్వేరు ఇన్సెంటివ్‌లు, క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ల‌తో క‌లిపి గ‌రిష్టంగా రూ.88,600 వ‌ర‌కూ రాయితీలు అందిస్తున్న‌ది. ఈ నెలాఖ‌రు వ‌ర‌కూ హోండా కార్స్ ఇండియా డిస్కౌంట్లు అమ‌ల్లో ఉంటాయి. భార‌త్ మార్కెట్లో హోండా కార్స్ ఇండియా విక్ర‌యిస్తున్న ఎస్‌యూవీ మోడ‌ల్.. హోండా సిటీ హైబ్రీడ్ వ‌ర్ష‌న్‌ ఎలివేట్ (Elevate)ను కొన‌సాగిస్తూనే ఈ రాయితీలు ప్ర‌క‌టించింది.

హోండా సిటీ (Honda City) సెడాన్ కారు కొనుగోలు చేసిన వారికి గ‌రిష్టంగా రూ.88,600 డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ రూ.25,000 లేదా ఫ్రీ యాక్సెస‌రీస్ రూపంలో రూ.26,947 రూపంలో బెనిఫిట్ క‌ల్పిస్తున్న‌ది. కారు ఎక్స్ఛేంజ్ బోన‌స్ రూపంలో రూ.15,000, క‌స్ట‌మ‌ర్ లాయాల్టీ బోన‌స్ రూ.4,000, హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోన‌స్ రూ.6000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5000 ల‌భిస్తుంది.

ఈ బెనిఫిట్ల‌తో పాటు న్యూ ఎలిగెంట్ ఎడిష‌న్ మిన‌హా అన్ని వేరియంట్ల‌పై హోండా కార్స్ స్పెష‌ల్ కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో రూ.20 వేల రాయితీ అందిస్తుంది. వీఎక్స్‌, జ‌డ్ఎక్స్ వేరియంట్ల‌పై రూ.13,651 విలువ గ‌ల వారంటీ బెనిఫిట్ పొడిగింపు ఉంటుంది. హోండా సిటీ ఎలిగెంట్ ఎడిష‌న్ మీద ఎక్స్ఛేంజ్ బోన‌స్ రూ.10 వేలు, స్పెష‌ల్ ఎడిష‌న్ బెనిఫిట్ రూ.40 వేలు రాయితీ అందిస్తున్న‌ది.

హ్యుండాయ్ వెర్నా, మారుతి సుజుకి సియాజ్ కార్ల‌కు పోటీగా ఉన్న హోండా సిటీ ధ‌ర రూ.11.63-16.10 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ప‌లుకుతుంది. ఈ నెలాఖ‌రులో హోండా సిటీ, అమేజ్ మోడ‌ల్ కార్ల ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి.

మారుతి సుజుకి డిజైర్‌, హ్యుండాయ్ మోటార్ ఇండియా ఔరాకు పోటీగా ఉన్న హోండా అమేజ్ కారుపై గ‌రిష్టంగా రూ.72 వేల వ‌ర‌కు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. హోండా అమేజ్ ఎస్ వేరియంట్‌పై రూ.30 వేల క్యాష్ డిస్కౌంట్ లేదా రూ.36,246 విలువైన ఫ్రీ యాక్సెస‌రీస్ పొందొచ్చు. ఈ వేరియంట్ కారుపై క్యాష్ డిస్కౌంట్ రూ.10 వేలు లేదా రూ.12,349 విలువైన ఫ్రీ యాక్సెస‌రీస్‌, వీఎక్స్ వేరియంట్ మీద రూ.20 వేల క్యాష్ డిస్కౌంట్ లేదా రూ.24,346 విలువైన ఫ్రీ యాక్సెస‌రీస్ పొందొచ్చు. హోండా అమేజ్ ధ‌ర రూ.7.13 ల‌క్ష‌ల నుంచి రూ.9.98 ల‌క్ష‌ల మ‌ధ్య (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతుంది.

అమేజ్ సెడాన్ కారు కొనుగోలుపై కారు ఎక్స్ఛేంజ్ బోన‌స్ రూ.15 వేలు, స్పెష‌ల్ కార్పొరేట్ డిస్కౌంట్ రూ.20 వేలు ఉంటుంది. ఈ బెనిఫిట్ల నుంచి ఎలైట్ ఎడిష‌న్‌కు మిన‌హాయింపు ఇచ్చింది. కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000, క‌స్ట‌మ‌ర్ లాయాల్టీ బోన‌స్ రూ.4,000, ఎలైట్ ఎడిష‌న్ కారు ఎక్స్ఛేంజ్ బోన‌స్ రూ.10 వేలు, స్పెష‌ల్ ఎడిష‌న్ బెనిఫిట్ రూ.30 వేలు అందిస్తోంది.

First Published:  6 Jan 2024 10:02 AM GMT
Next Story