Telugu Global
NEWS

Tamannaah Bhatia: ఇతనే నా భర్త అంటూ.. ఓ ఫొటో షేర్ చేసిన తమన్నా..!

Tamannaah Bhatia Husband: తన పెళ్లి వార్తలపై వచ్చిన ప్రచారంపై తమన్నా స్పందిస్తూ.. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ చేసింది. తన భర్త ఇతడేనని, వ్యాపారవేత్త కూడా అని ఒక ఫోటో షేర్ చేసింది.

Tamannaah Bhatia Husband Name
X

Tamannaah Bhatia: ఇతనే నా భర్త అంటూ.. ఓ ఫొటో షేర్ చేసిన తమన్నా..!

హీరోయిన్లు తాము నటించే సినిమాల సంఖ్య కాస్త తగ్గించుకున్నా చాలు కొందరు గాసిప్ రాయుళ్లు వెంటనే సదరు హీరోయిన్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందని, పెళ్ళికొడుకు ఫలానా ప్రాంతానికి చెందినవాడు అంటూ ప్రచారం చేయడం మొదలు పెడుతున్నారు. ఇటువంటి ప్రచారాలు హీరోయిన్లపై మొదటి నుంచి ఉన్నప్పటికీ ఈ మధ్య కాస్త ఎక్కువైంది. కొద్దిరోజుల కిందట యంగ్ హీరోయిన్ వర్షా బొల్లమ్మ టాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ నిర్మాత కొడుకును త్వరలో పెళ్లి చేసుకోబోతుందని జోరుగా ప్రచారం జరిగింది. ఆ వార్తలపై వర్షా స్పందిస్తూ నాకు తెలియకుండానే నాకోసం పెళ్లి కొడుకును వెతికి పెట్టినందుకు థాంక్స్ అంటూ సెటైర్లు వేసింది.

ఆ తర్వాత ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి గురించి కూడా ఇటువంటి ప్రచారమే జరిగింది. పెళ్లి ఓకే అయ్యింది కాబట్టే ఆమె కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదు అంటూ కొందరు ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆ ప్రచారం నిజం కాదని తర్వాత తేలింది. తాజాగా ప్రముఖ నటి తమన్నా త్వరలో ముంబైకి చెందిన ఒక పారిశ్రామికవేత్తను పెళ్లి చేసుకోబోతుందని జోరుగా ప్రచారం మొదలైంది. తమన్నా తన వద్దకు వచ్చిన కొత్త సినిమాలను అంగీకరించడం లేదని కూడా కామెంట్స్ వినిపించాయి. అయితే ఈ వార్తల్లో కూడా నిజం లేదని తాజాగా నిర్ధారణ అయ్యింది.



తన పెళ్లి వార్తలపై వచ్చిన ప్రచారంపై తమన్నా స్పందిస్తూ.. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ చేసింది. తన భర్త ఇతడేనని, వ్యాపారవేత్త కూడా అని ఒక ఫోటో షేర్ చేసింది. ఆమె షేర్ చేసిన ఫొటో ఎవరిదో కాదు.. ఆమెదే. ఎఫ్ 3 సినిమాలో తమన్నా కొన్ని సన్నివేశాల్లో మగాడిగా నటించింది. ఆ సినిమాలో తాను మగాడి వేషంలో కనిపించిన ఒక ఫోటోను తమన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మ్యారేజ్ రూమర్స్ అనే హ్యాష్ ట్యాగ్ ని జత చేసింది. తమన్నా చేసిన ఈ పోస్ట్ తో గాసిప్ రాయుళ్లకు భలే చెక్ పెట్టింది. ప్రస్తుతం తమన్నా చిరంజీవితో కలిసి భోళాశంకర్ అనే సినిమాలో నటిస్తోంది. అలాగే యంగ్ హీరో సత్యదేవ్ కు జోడీగా గుర్తుందా శీతకాలం అనే మరో సినిమాలో నటిస్తోంది.

First Published:  17 Nov 2022 7:15 AM GMT
Next Story