Telugu Global
NEWS

అంబేద్కర్ బతికి ఉంటే చంపేసేవాడినంటూ వ్యాఖ్యలు.. హమారా ప్రసాద్ అరెస్ట్

హమారా ప్రసాద్ సోషల్ మీడియాలో అంబేద్కర్ మీద వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. అంబేద్కర్ కానీ బతికి ఉంటే ఆయనను తాను, గాంధీని గాడ్సే కాల్చి చంపినట్టు కాల్చి చంపేవాడినని వ్యాఖ్యలు చేశాడు.

అంబేద్కర్ బతికి ఉంటే చంపేసేవాడినంటూ వ్యాఖ్యలు.. హమారా ప్రసాద్ అరెస్ట్
X


డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై, దళిత, వామపక్ష సంఘాలపై, ముస్లింలపై, బీఆరెస్, కాంగ్రెస్, ఎమ్ ఐ ఎమ్ లపై ప్రతీ రోజు నోరు పారేసుకుంటూ, తనను తాను హిందుత్వ వాదినని ప్రకటించుకున్న 'రాష్ట్రీయ దళిత సేన ఫౌండర్' హమారా ప్రసాద్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. చాలా కాలంగా ఆయన‌ వ్యాఖ్యలపై వ్యతిరేకత‌ వస్తున్నప్పటికీ ఎవ్వరూ ఇప్పటి వరకు ఆయన పై పోలీసు కంప్లైంట్ ఇవ్వలేదు. చివరకు నిన్న బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ జోక్యంతో పోలీసుకు హమారా ప్రసాద్ ను అరెస్టు చేశారు.

ఈ హమారా ప్రసాద్ సోషల్ మీడియాలో అంబేద్కర్ మీద వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. అంబేద్కర్ కానీ బతికి ఉంటే ఆయనను తాను, గాంధీని గాడ్సే కాల్చి చంపినట్టు కాల్చి చంపేవాడినని వ్యాఖ్యలు చేశాడు.

ఆయన మాట్లాడి పోస్ట్ చేసిన వీడియోలో "అంబేడ్కర్ 12 డిగ్రీలు చదివిన గొప్ప వ్యక్తి, మేధావి. ఒక దేశ రాజ్యాంగాన్ని రాశానని చెప్పుకునే మహా మేధావి. ఒక నాయకుడనే వాడు.. ప్రజలందరినీ సమానంగా చూడాలి. తనకు నష్టం కలిగినా కూడా.. ఎదుటివాళ్ల మీద తన ద్వేషాన్ని పెంచుకోకూడదు. అందరినీ సమానంగా చూడాలి. వివక్ష చూపంచకూడదు. ఏమైనా లోపాలుంటే వాటిని తొలగించేందుకు కృషి చేయాలి. అంతే కానీ.. ఒక మతాన్ని, కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ.. అంబేడ్కర్ ఓ పుస్తకం రాశారు. నేను గనక ఆయన ఉన్న రోజుల్లో ఈ పుస్తకం చదివి ఉంటే.. మరో గాడ్సే అయ్యేవాడిని, అంబేడ్క‌ర్ ను చంపేసేవాడిని" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు హమారా ప్రసాద్.

హమారా ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి చాలా మంది ఆయనను విమర్శించారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ చూసిన బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. హమారా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి కొందరు ఆయనపై పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు. దీంతో స్పందించిన హైదరాబాద్ పోలీసులు హమారా ప్రసాద్ పై వివిధ సెక్ష‌న్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

First Published:  11 Feb 2023 4:00 AM GMT
Next Story