Telugu Global
NEWS

రండి.. వయసును కాస్త తగ్గించుకుందాం..

ట్రెండీగా ముస్తాబయ్యేవారు మేకప్​పై దృష్టిపెట్టాలి. అలా అని ట్రెడీషనల్​గా ఉండేవారు కూడా సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి. అసలు ఎవరైనా సరే ఉదయం, సాయంత్రం కచ్చితంగా స్కిన్​ కేర్ రోటీన్ ఫాలో అవ్వాలి.

రండి.. వయసును కాస్త తగ్గించుకుందాం..
X

చిన్నపిల్లలకు త్వరగా పెద్దవాళ్ళయిపోదాం అన్న ఉత్సాహం ఉంటుందో లేదో.. చెప్పలేం కానీ, వయసు పెరిగేకొద్దీ చాలామంది యవ్వనంగా కనపడాలని కోరుకుంటారు. ఏజ్ పెరిగేకొద్ది చర్మంపై ముడతలు పడి వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. మరోవైపు తెలిసీ తెలియని మేకప్, అనారోగ్యకరమైన అలవాట్లు అన్నీ కలిపి మనల్ని ఉన్న వయస్సు కంటే ఎక్కువ వయసున్న వారిలా తయారు చేసేస్తాయి. ఈ సమస్య నుంచి సులభంగా ఎలా బయటపడాలో ఇప్పుడు చూద్దాం..



ఏది పడితే అది తింటూ, ఎలా పడితే అలా ఉంటే మీ వయసుకంటే మీరు పెద్దవారిలా కనిపించడం ఖాయం. కాబట్టి తిండి, వ్యాయామం అనే రెండు విషయాలపై శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే అధిక బరువు మిమ్మల్ని ఇబ్బందుల‌కు గురిచేస్తుంది. రెగ్యూలర్​గా వ్యాయామం చేస్తే.. బరువు తగ్గడంతో పాటు.. మొహంలో సహజమైన గ్లో వస్తుంది.



మీ లుక్స్​ని మీరే మార్చుకోండి. ముఖ్యంగా హెయిర్​పైనే కాదు హెయిర్ స్టైల్ పై కూడా కాస్త ఎక్కువ శ్రద్ధ చూపించాలి. మీ ముఖానికి ఏ హెయిర్ స్టైల్​ బాగా నప్పుతుందో గుర్తించి.. వాటిని ట్రై చేయండి. మరీ గత కొన్ని సంవత్సరాలుగా కనపడుతున్న రూపంలో కాకుండా కాస్త కొత్త లుక్ కోసం కావాలంటే.. జుట్టును స్టైల్ చేయడం, కర్ల్స్ చేయడం వంటివి చేస్తూ ఉంటే, మీరు యంగ్​గా కనిపిస్తారు.



ట్రెండీగా ముస్తాబయ్యేవారు మేకప్​పై దృష్టిపెట్టాలి. అలా అని ట్రెడీషనల్​గా ఉండేవారు కూడా సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి. అసలు ఎవరైనా సరే ఉదయం, సాయంత్రం కచ్చితంగా స్కిన్​ కేర్ రోటీన్ ఫాలో అవ్వాలి. ఇవి ముఖంపై మురికిని, పింపుల్స్​ని దూరం చేసి.. మెరిసే, అందమైన లుక్​ని ఇస్తాయి. అలా అని మరీ ప్రతిసారీ పార్లర్ కి వెళ్ళా ల్సిన అవసరం లేదు. వారం, రెండు వారాలకోకసారి జస్ట్ ఫేస్ ని క్లీన్ చేసుకొని, స్క్రబ్ చేసుకొని కాస్త ఫేస్ ప్యాక్ వేసుకోండి స్కిన్​కేర్ ఫాలో అవ్వడం వల్ల ముడతలు కూడా దరి చేరవు.

వీటన్నిటితో పాటూ చర్మం ఎప్పటికీ యవ్వనంగా కనిపించాలంటే పోషకాలున్న ఫుడ్స్ తీసుకోవాలి. టమాటాలు, ఆకు కూరలు పోషకాలకి కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. వాటిని తీసుకోవడం వల్ల చర్మం అందంగా, యవ్వనంగా కనిపిస్తుంది.

First Published:  7 Jun 2024 11:02 AM GMT
Next Story