Telugu Global
NEWS

పచ్చళ్లు అధికంగా తినే మగవారిలో లైంగిక సామర్థ్యం తగ్గుతుందా?

ఇంట్లో చేసుకునే పచ్చళ్లలో నూనె ఎక్కువగా కలుపుతారు. కమర్షియల్‌గా తయారు చేసే పచ్చళ్లలో వెనిగర్ కూడా ఉంటుంది. ఇలా నూనె లేదా వెనిగర్ కలపడం వల్ల లాస్టిక్, సిట్రిక్, ఎసిటిక్ వంటి యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయి.

పచ్చళ్లు అధికంగా తినే మగవారిలో లైంగిక సామర్థ్యం తగ్గుతుందా?
X

నిల్వ పచ్చళ్లు లేదా ఊరగాయలు ప్రతీ ఒక్కరి ఇంట్లో ఉంటాయి. తెలుగు ప్రజలు సీజనల్ పచ్చళ్లు పెట్టడంలో ముందుంటారు. ముఖ్యంగా మామిడి, ఉసిరి, చింత, పండు మిర్చి పచ్చళ్లు ఎక్కువగా పెడతారు. ఈ మధ్య నాన్-వెజ్ పచ్చళ్లు కూడా ఎక్కువగా తయారు చేస్తున్నారు. చికెన్, ఫిష్, మటన్, రొయ్యల పచ్చళ్లు ఇంట్లో పెట్టడమే కాకుండా బయట మార్కెట్‌లో కూడా దొరుకుతుంటాయి. చాలా మందికి ఏదో ఒక పచ్చడి లేకపోతే ముద్ద దిగదు. పెరుగన్నంలో కూడా ఓ మామిడి కాయ ముక్క ఉంటే.. అబ్బా ఆ రుచే వేరు. ఇక మందుబాబులైతే తినడానికి ఏమీ లేకపోతే పక్కన కాస్త ఊరగాయ పెట్టుకొని చ‌ప్ప‌రిస్తూ పని కానిచ్చేస్తుంటారు. నూనె, ఉప్పు, వెనిగర్ వంటి పదార్థాలు కలపడం వల్ల ఈ పచ్చళ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

ఇంట్లో చేసుకునే పచ్చళ్లలో నూనె ఎక్కువగా కలుపుతారు. కమర్షియల్‌గా తయారు చేసే పచ్చళ్లలో వెనిగర్ కూడా ఉంటుంది. ఇలా నూనె లేదా వెనిగర్ కలపడం వల్ల లాస్టిక్, సిట్రిక్, ఎసిటిక్ వంటి యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ మూడు కూడా మన శరీరానికి మేలు చేసేవే. శరీరం పటిష్టంగా, యాక్టీవ్‌గా ఉండేలా చేస్తాయి. ఈ యాసిడ్స్ మన జీర్ణాశయంలో మైక్రోబ్స్‌లాగా పని చేస్తాయి. దీని వల్ల జీర్ణ క్రియ చక్కగా పనిచేయడమే కాకుండా బాడీ మెటబాలిజం కూడా మెరుగవుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండటానికి కూడా ఈ యాసిడ్స్ ఉపయోగపడుతాయి.

కొంత మంది పచ్చళ్లలో ఉప్పు, కారం, పసుపుతో పాటు ఇతర సుగంధ ద్రవ్యాలు కూడా వేస్తుంటారు. వీటి వల్ల పచ్చడిలో యాంటీఆక్సిడెంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ వంటివి చేరి మన శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే, పచ్చళ్లు విపరీతంగా తినడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయని పరిశోధనలు చెప్తున్నాయి. ఈ పచ్చళ్లలో ఎక్కువ క్యాలరీలు ఉండవు. దీంతో పచ్చళ్లతో భోజనం చేసిన కాసేపటికే మళ్లీ ఆకలి వేస్తుంది. దీంతో స్నాక్స్, ఇతర జంక్ ఫుడ్ తినడానికి అలవాటు పడతారు. ఇది శరీరానికి చేటు చేస్తుంది.

పురుషులు పచ్చళ్లు ఎక్కువగా తింటే పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు. ఇందులో అష్టమిప్రిడ్ కార్బన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒక్కోసారి అంగస్తంభన సరిగా ఉండదని హెచ్చరిస్తున్నారు. పచ్చళ్లు తినే వాళ్లు కూడా ఇంట్లో తయారు చేసిన వాటికే ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు. మార్కెట్లో దొరికే ఊరగాయల్లో రుచి కోసం ఎక్కువ నూనె, మసాలాలు, వెనిగర్ కలుపుతుంటారు. ఇది మన ఆరోగ్యానికి చెడు చేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే పచ్చళ్లను పరిమితంగానే వాడాలని వైద్యులు చెబుతున్నారు.

First Published:  6 Oct 2022 2:12 AM GMT
Next Story