Telugu Global
NEWS

రాగాలు పలికించే మ్యూజికల్ రోడ్స్ గురించి తెలుసా?

ఒక్క డెన్మార్క్‌లోనే కాదు, ఈ ఐడియా చాలా దేశాల్లో పాపులర్ అయింది. రోడ్డుపై వెళ్తుంటే రాగాలు, వైబ్రేషన్స్ వినిపించేలా చాలా దేశాలు మ్యూజికల్ రోడ్స్‌ను నిర్మిస్తున్నాయి.

రాగాలు పలికించే మ్యూజికల్ రోడ్స్ గురించి తెలుసా?
X

కేవలం సంగీత వాయిద్యాలు మాత్రమే కాదు, రహదారులు కూడా రాగాలు పలికించగలవు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే ఈ మ్యూజికల్ రోడ్స్ గురించి తెలుసుకోవాల్సిందే..

రోడ్డుపై వాహనాల వేగాన్ని కంట్రోల్ చేసేందుకు డెన్మార్క్‌ ప్రభుత్వం ఒక కొత్త ఇన్నోవేషన్‌ను తీసుకొచ్చింది. రోడ్డుపై వాహనాలు వెళ్లేటప్పుడు వచ్చే రయ్ రయ్ మనే శబ్దాలను మంచి మ్యూజికల్ నోట్స్‌లా మార్చింది. రోడ్డుపై వాహనం వెళ్తున్నప్పుడు లయబద్ధంగా శబ్దాలు వినిపించేలా రోడ్లను తీర్చిదిద్దింది. ఒక్క డెన్మార్క్‌లోనే కాదు, ఈ ఐడియా చాలా దేశాల్లో పాపులర్ అయింది. రోడ్డుపై వెళ్తుంటే రాగాలు, వైబ్రేషన్స్ వినిపించేలా చాలా దేశాలు మ్యూజికల్ రోడ్స్‌ను నిర్మిస్తున్నాయి.

మ్యూజికల్ రోడ్ల ఏర్పాటు కోసం త్రికోణాకారంలో ఉండే అల్యూమినియం చువ్వలను వాడతారు. వీటిని గిటార్‌‌లోని తీగల మాదిరిగా రోడ్డుపై లయబద్ధంగా అమర్చుతారు. తర్వాత వాటిపై పల్చగా తారు పోస్తారు. దానిపై ఒక నిర్ధిష్ట వేగంతో వాహనం వెళ్లినప్పుడు చువ్వల నుంచి లయబద్దమైన సంగీతం వినిపిస్తుంది.


మ్యూజికల్ రోడ్డు కాన్సెప్ట్‌ను డెన్మార్క్‌ ప్రభుత్వం 1995లో తీసుకొచ్చింది. రోడ్డుపై గంటకు 45 మైళ్ల వేగంతో వెళ్లినప్పుడు మ్యూజికల్ నోట్స్ వినిపించేలా ర‌హ‌దారుల‌ను డెవలప్ చేసింది. ఈ మోడల్ సక్సెస్ అవ్వడంతో తర్వాత చాలా దేశాలు ఇలాంటి రోడ్స్‌ను ఏర్పాటు చేశాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న సివిక్‌ మ్యూజికల్‌ రోడ్డు, జపాన్‌లో ఉన్న మెలోడి రోడ్డు, దక్షిణ కొరియాలోని సింగింగ్‌ రోడ్డు.. ఇవన్నీ మ్యూజికల్ రోడ్సే.

First Published:  26 July 2022 11:41 AM GMT
Next Story