Telugu Global
NEWS

Chiranjeevi: అబ్బో.. చిరంజీవి వెటకారం మామూలుగా లేదుగా..

Chiranjeevi: వాల్తేరు వీరయ్య సినిమాకు తక్కువ రేటింగ్ ఇచ్చిన విమర్శకులపై తన స్టైల్లో కౌంటర్ వేశారు చిరంజీవి . ఓవర్సీస్ లో వాల్తేరు వీరయ్య మంచి కలెక్షన్స్ సాధిస్తుండటంతో అక్కడి అభిమానులను చిరంజీవి జూమ్ యాప్ ద్వారా పలకరించారు.

Chiranjeevi: అబ్బో.. చిరంజీవి వెటకారం మామూలుగా లేదుగా..
X

చిరంజీవి హీరోగా సంక్రాంతి పండుగ‌కు విడుద‌లైన వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో కూడా సత్తా చాటుతోంది.


ఇప్పటికే అక్కడ 2.3 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు ఓవర్సీస్ లోనూ ఈ సినిమాకు నిలకడగా వసూళ్లు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు 2.25 రేటింగ్ ఇచ్చిన క్రిటిక్స్ పై కౌంటర్ వేశారు.

వాల్తేరు వీరయ్య సినిమా విడుదలైన రోజు ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. పలువురు సినీ విమర్శకులు ఈ సినిమాకు 2.25 రేటింగ్ మాత్రమే ఇచ్చారు. అయితే ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవిని చూపడంలో దర్శకుడు బాబీ సక్సెస్ అయ్యాడు. సినిమా రొటీన్ గా ఉన్నప్పటికీ చాలామంది ఫ్యాన్స్ చిరంజీవి మార్క్ యాక్షన్, కామెడీ కోసం ఈ సినిమాను చూశారు. ఇక సంక్రాంతికి ఈ మూవీ విడుదల కావడంతో పండుగ సెలవులను కూడా క్యాష్ చేసుకుని బ్రేక్ ఈవెన్ సాధించింది.

ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య సినిమాకు తక్కువ రేటింగ్ ఇచ్చిన విమర్శకులపై తన స్టైల్లో కౌంటర్ వేశారు చిరంజీవి . ఓవర్సీస్ లో వాల్తేరు వీరయ్య మంచి కలెక్షన్స్ సాధిస్తుండటంతో అక్కడి అభిమానులను చిరంజీవి జూమ్ యాప్ ద్వారా పలకరించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్తేరు వీరయ్య విడుదలైన రోజు క్రిటిక్స్ 2.25 రేటింగ్ ఇవ్వడంతో ముందు తనకు అర్థం అవలేదని, ఆ తర్వాత అర్థమైంది ఏమిటంటే వాళ్ళు ఇచ్చింది రేటింగ్ కాదని 2.25 మిలియన్ల డాలర్ల వసూళ్లు సాధిస్తుందని హింట్ ఇచ్చారని సెటైర్ వేశారు. వాల్తేరు వీరయ్యకు 2.25 మిలియన్ల డాలర్లు వసూళ్లు దక్కుతాయని క్రిటిక్స్ ముందే చెప్పారని, అయితే దానిని అర్థం చేసుకోవడంలో తానే పొరబడ్డానని కౌంటర్ వేశారు.

First Published:  23 Jan 2023 8:56 AM GMT
Next Story