Telugu Global
NEWS

వివేకా హత్యతో లాభం ఎవరికి?

ఏదో లాభం కోసమే వివేకాను హత్య చేసిన విషయాన్ని సీబీఐ కన్ఫర్మ్ చేస్తోంది. కాకపోతే ఆ లాభం ఏమిటి? వివేకా హత్యతో లాభపడేదెవరు అనే విషయాన్నే దర్యాప్తు చేస్తున్నామని చెప్పింది. ఇక్కడే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

వివేకా హత్యతో లాభం ఎవరికి?
X

వైయ‌స్ వివేకానందరెడ్డి హత్య వల్ల లాభపడేవాళ్ళు ఎవరనే విషయం మీదే తాము దర్యాప్తు చేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది. అంటే ఇన్ని సంవత్సరాల దర్యాప్తు మళ్ళీ మొదటికి వచ్చిందనే అనిపిస్తోంది. ఏదో లాభం కోసమే వివేకాను హత్య చేసిన విషయాన్ని సీబీఐ కన్ఫర్మ్ చేస్తోంది. కాకపోతే ఆ లాభం ఏమిటి? వివేకా హత్యతో లాభపడేదెవరు అనే విషయాన్నే దర్యాప్తు చేస్తున్నామని చెప్పింది. ఇక్కడే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

వివేకా హత్యకేసు విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తుల వాగ్మూలాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. వివేకా హత్యలో కడప ఎంపీ అవినాష్ రెడ్డే సూత్రధారని చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా పదేపదే ఆరోపిస్తున్నారు. కడప ఎంపీ సీటు కోసమే వివేకాను హత్యచేశారంటున్నారు. లాజికల్‌గా ఆలోచిస్తే వాళ్ల‌ ఆరోపణ తప్పు. ఎందుకంటే వివేకా హత్య జరిగేనాటికే అవినాష్ సిట్టింగ్ ఎంపీ. 2019 ఎన్నికల్లో మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అవినాష్ గెలుపు కోసం వివేకా ప్రచారం కూడా చేస్తున్నారు. తనకు ఏరకంగాను పోటీకి రాని, గెలుపు కోసం కష్టపడుతున్న వివేకాను హత్య చేయాల్సిన అవసరం అవినాష్‌కు ఏముంటుంది?

ఇక కుటుంబ గొడవలు కూడా ఎక్కువగానే ఉన్నాయట. ఆస్తుల బదలాయింపు, వారసుడి ప్రకటన కారణంగానే వివేకా హత్య జరిగిందనే ప్రచారం కూడా ఉంది. వివేకా ముస్లిం యువతిని వివాహం చేసుకున్నాడని, కొడుకునే వారసుడిగా ప్రకటించాలని వివేకా అనుకుంటే అందుకు భార్య, కూతురు సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి అడ్డుకున్నారనే ఆరోపణలు తెలిసిందే. వీళ్ళమధ్య ఆస్తుల గొడవలు చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా ప్రచారముంది.

ఇక ఎర్ర గంగిరెడ్డి లాంటి వాళ్ళ ద్వారా వివేకా ఆస్తుల పంచాయితీలు చేసినట్లు చెబుతున్నారు. బెంగుళూరులో జరిగిన ఒక పంచాయితిలో దాదాపు రూ.100 కోట్లు వస్తే దాన్ని సిండికేట్‌లోని భాగస్వాములకు పంచకుండా వివేకానే ఉంచేసుకున్నారట. ఆ విషయంలోనే వివేకాతో సిండికేట్ సభ్యులకు గొడవలయ్యాయని తర్వాతే హత్య జరిగిందనే ప్రచారం తెలిసిందే. చివరకు తన తల్లిని వివేకా లైంగికంగా వేధించినందుకు హత్య చేసినట్లు నిందితుల్లో ఒకడైన సునీల్ యాద‌వ్‌ తరపు లాయర్ కోర్టులో చెప్పారు. మరీ పై కారణాల్లో సీబీఐ దేన్ని నిజమని నిరూపించగలదు?

First Published:  14 April 2023 4:43 AM GMT
Next Story