Telugu Global
NEWS

రాజ‌ధాని ఫైల్స్ సినిమా విడుద‌లపై హైకోర్టు స్టే

అమ‌రావ‌తి రాజ‌ధానిని ప్ర‌భుత్వం అన్యాయంగా అడ్డుకుంద‌ని టీడీపీ అనుకూల శ‌క్తులు వైసీపీ ప్ర‌భుత్వంపై బుర‌ద‌చ‌ల్లే ఉద్దేశంతో తీసిన రాజ‌ధాని ఫైల్స్ సినిమా విడుద‌ల‌కు హైకోర్టు అడ్డుక‌ట్ట వేసింది.

రాజ‌ధాని ఫైల్స్ సినిమా విడుద‌లపై హైకోర్టు స్టే
X

అమ‌రావ‌తి రాజ‌ధానిని ప్ర‌భుత్వం అన్యాయంగా అడ్డుకుంద‌ని టీడీపీ అనుకూల శ‌క్తులు వైసీపీ ప్ర‌భుత్వంపై బుర‌ద‌చ‌ల్లే ఉద్దేశంతో తీసిన రాజ‌ధాని ఫైల్స్ సినిమా విడుద‌ల‌కు హైకోర్టు అడ్డుక‌ట్ట వేసింది. ఈ రోజు (ఫిబ్ర‌వ‌రి 15) రిలీజ్ కావాల్సిన‌ సినిమా విడుద‌ల‌పై స్టే విధించింది. రేప‌టి వ‌ర‌కు సినిమా విడుద‌ల ఆపేయాల‌ని, సినిమాకు సంబంధించిన పూర్తి రికార్డుల‌ను త‌మ‌కు అందించాల‌ని ఆదేశించింది.

యాత్ర 2 పేరుతో 2019కు ముందు ప‌దేళ్ల‌పాటు వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎదుర్కొన్న క‌ష్ట‌న‌ష్టాల‌పై సినిమా తీస్తే జ‌నం నుంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వంపై బుర‌ద‌చ‌ల్ల‌డానికే అప్ప‌టిక‌ప్పుడు రాజ‌ధాని ఫైల్స్ సినిమా చిత్రీక‌రించ‌డం ఇక్క‌డ ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి.

అక్ర‌మాల‌పై విచార‌ణ‌కు ఆదేశించ‌డ‌మూ త‌ప్పేనా?

అక్ర‌మాలు జ‌రిగాయంటూ వైసీపీ ప్ర‌భుత్వం వాటిపై విచార‌ణకు ఆదేశించింది. అక్క‌డ రాజ‌ధాని వ‌స్తుంద‌ని ముందే తెలిసి, టీడీపీ నేత‌లు, కావాల్సిన‌వారు భూములు కొనుక్కున్నాకే రాజ‌ధాని ప్ర‌క‌టించి, వారికి ల‌బ్ధి చేకూర్చార‌ని తెలిసి అక్క‌డ నిర్మాణాలు ఆపి, న్యాయ‌విచార‌ణ‌కు ప‌ట్టుబ‌ట్టింది. అయితే దీన్ని రాజ‌కీయం చేయ‌డానికి టీడీపీ అనుకూల శ‌క్తులు రాజ‌ధాని ఫైల్స్ పేరిట సినిమా తీసి ప్రాప‌గాండా చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాయి.

'రాజధాని ఫైల్స్ సినిమా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా వుందని... అందువల్ల విడుదలను ఆపాలని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే సెన్సార్ బోర్డ్ జారీచేసిన స‌ర్టిఫికెట్‌ను రద్దు చేసి సినిమా విడుదలను ఆపాలని అప్పిరెడ్డి హైకోర్టును కోరారు. దీంతో విచార‌ణ జ‌రిపిన కోర్టు సినిమా విడుద‌ల‌పై స్టే విధించింది.

First Published:  15 Feb 2024 6:51 AM GMT
Next Story