Telugu Global
NEWS

సాంకేతిక లోపాన్ని .. ఇలా వాడుకున్న 'ఆహా'

ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చూశారా? మా హీరో ప్రతాపం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఆహా యాప్ నాసిరకం సర్వర్లు వాడటం వల్లే ఇటువంటి సమస్య వచ్చిందని నిపుణులు అంటున్నారు.

సాంకేతిక లోపాన్ని .. ఇలా వాడుకున్న ఆహా
X

ఆహా అనే యాప్ తెలుగునాట ఎంతటి పాపులారిటీ సంపాదించుకున్నదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అరవింద్ ఆ యాప్ వ్యవస్థాపకుడు.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు పెరిగిపోతున్న గిరాకీని దృష్టిలో ఉంచుకొని ఆయన ఆ యాప్ ను రూపొందించాడు. అనంతరం కరోనా రావడం కలిసి వచ్చింది. ఆ టైంలో అందరూ ఇంట్లోనే ఉన్నారు.. కాబట్టి ఇబ్బడిముబ్బడిగా యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఆహా యాప్ లో వచ్చే అన్ స్టాపబుల్ షో విప‌రీత‌మైన పాపులారిటీ సాధించింది. బాలకృష్ణ హోస్ట్ చేస్తుండటంతో ఆ షోకు ఎనలేని క్రేజ్ వచ్చింది.

ఆ తర్వాత గెస్టులుగా వచ్చే వాళ్లు కూడా ప్రముఖులే కావడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. బాలయ్య ప్రశ్నలు అడిగే విధానం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఇందులో భాగంగానే బాలయ్య షోకు ప్రభాస్ గెస్ట్ గా వస్తాడని అనౌన్స్ కాగానే.. ఈ షోకు ఎనలేని క్రేజ్ ఏర్పడింది. 29న ఈ షోను స్ట్రీమింగ్ చేస్తారని ఆహా టీమ్ అనౌన్స్ చేశారు. అయితే .. అదే రోజు సాంకేతిక లోపంతో ఆహా యాప్ క్రాష్ అయ్యింది. అయితే ప్రభాస్ కు ఉన్న ఫాలోయింగ్ వల్ల.. అతడి ఫ్యాన్స్ భారీ సంఖ్యలో యాప్ ను ఓపెన్ చేయడం వల్ల యాప్ క్రాష్ అయ్యిందని ఆహా నిర్వాహకులు చెప్పుకున్నారు.

ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చూశారా? మా హీరో ప్రతాపం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఆహా యాప్ నాసిరకం సర్వర్లు వాడటం వల్లే ఇటువంటి సమస్య వచ్చిందని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ పరిజ్ఞానం ఉపయోగించలేదన్నది వారి వాదన. విషయం ఇదైతే ఆహా మాత్రం ప్రభాస్ పేరు చెప్పి చర్చను తప్పుదోవ పట్టించింది.

First Published:  30 Dec 2022 11:05 AM GMT
Next Story