Telugu Global
NEWS

నాకా..పెళ్లా? తెలీకుండానే భలే సెట్ చేశారే..యంగ్ హీరోయిన్ సెటైర్

తన పెళ్లిపై వస్తున్న వార్తలపై తాజాగా వర్ష బొల్లమ్మ స్పందించింది. 'నాకోసం నాకు తెలియకుండానే పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు.. ఒక అబ్బాయిని కూడా సెలెక్ట్ చేశారు. ఈ వార్తలు ప్రచురించిన మీడియా సంస్థలకు థాంక్యూ.

నాకా..పెళ్లా?  తెలీకుండానే భలే సెట్ చేశారే..యంగ్ హీరోయిన్ సెటైర్
X

తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా నటించిన `96` సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది వర్ష బొల్లమ్మ. ఆ తర్వాత హీరోయిన్ గా మారి వరుసగా సినిమాలు చేస్తోంది ఈ భామ. వర్ష బొల్లమ్మ టాలీవుడ్ లోకి `చూసీచూడంగానే` అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్, స్టాండప్ రాహుల్ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఇటీవల ఆమె హీరోయిన్ గా నటించిన స్వాతిముత్యం సినిమా ఘన విజయం సాధించింది. కాగా రెండు మూడు రోజులుగా వర్ష బొల్లమ్మ వివాహంపై వరుసగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ కు చెందిన ఒక బడా నిర్మాత కొడుకుతో వర్ష బొల్లమ్మ పెళ్లి ఖాయం అయ్యిందంటూ ప్రచారం జరిగింది. వర్ష పెళ్లి విషయమై ప్రధాన మీడియా సంస్థల్లో కూడా వార్తలు వచ్చాయి. దీంతో ఈ ప్రచారం నిజమేమోనని అంతా భావించారు.

ఇదిలా ఉండగా తన పెళ్లిపై వస్తున్న వార్తలపై తాజాగా వర్ష బొల్లమ్మ స్పందించింది. 'నాకోసం నాకు తెలియకుండానే పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు.. ఒక అబ్బాయిని కూడా సెలెక్ట్ చేశారు. ఈ వార్తలు ప్రచురించిన మీడియా సంస్థలకు థాంక్యూ. మీరు ఎంపిక చేసిన ఆ అబ్బాయి ఎవరో చెబితే నేను కూడా మా ఇంట్లో వాళ్లకు చెబుతాను' అంటూ కామెంట్స్ చేసింది. వర్ష బొల్లమ్మ ఇచ్చిన క్లారిటీతో ఆమె పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ గాలి వార్తలని తేలిపోయింది.

First Published:  29 Oct 2022 12:06 PM GMT
Next Story