Telugu Global
NEWS

'ఇండిగో'పై రానా షాకింగ్ కామెంట్స్.. నెటిజన్స్ నుంచి భారీ మద్దతు

ప్రముఖ నటుడు రానాకు ఇండిగో విమానయాన సంస్థపై కోపమొచ్చింది. సదరు సంస్థ తీరుతో విసుగుచెంది తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఇండిగోపై రానా షాకింగ్ కామెంట్స్..  నెటిజన్స్ నుంచి భారీ మద్దతు
X

ప్రముఖ నటుడు రానా వివాదాలకు చాలా దూరం. తన పనేదే తాను చేసుకుంటూ వెళ్తుంటారు. ఇక విభిన్నమైన రోల్స్ చేస్తూ.. కొత్త తరహా కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను థ్రిల్ చేస్తారు. కమర్షియల్ కథాంశాలతోపాటు విభిన్నమైన కథలకే ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా రానాకు ఇండిగో విమానయాన సంస్థపై కోపమొచ్చింది. సదరు సంస్థ తీరుతో విసుగుచెంది తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

'ఇండిగో విమానాలు అనుకున్న సమయానికి టేకాఫ్ కాకపోవచ్చు.. ల్యాండ్ కాకపోవచ్చు.. మీ లగేజ్ కూడా భద్రత ఉండదు' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇండిగో వింటర్ సేల్ ఆఫర్‌పై అఫిషియల్ అకౌంట్‌లో ట్వీట్ చేయగా.. దానికి రీ ట్వీట్ చేస్తూ రానా గట్టిగా కౌంటర్లు ఇచ్చారు. అందుకు నెటిజన్ల నుంచి కూడా మద్దతు దొరికింది.


ఇండిగో విమానయాన సంస్థ పనితీరుపై వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. రానాకు మద్దతు పలికారు. ఈ ఉదయం రానా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరారు. కుటుంబ సభ్యులతో కలిసి విమానాశ్రయానికి చేరుకున్నారు. రానా చెక్ ఇన్ అయిన అనంతరం .. ఈ విమానం ఆలస్యం అవుతుందని మరో విమానంలో వెళ్లాలని సిబ్బంది చెప్పారు. లగేజ్ కూడా పంపిస్తామన్నారు. కానీ బెంగళూరు వెళ్లాక.. లగేజ్ గురించి అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో రానాకు కోపమొచ్చింది.

First Published:  4 Dec 2022 2:39 PM GMT
Next Story