Telugu Global
Health & Life Style

పెళ్లి అంటే భయపడుతున్నారా? ఇది తెలుసుకోండి!

పెళ్లి అంటే భయపడేవాళ్లు ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ తీసుకోవచ్చు. పెళ్లికి ముందే ఒకరి వ్యక్తిత్వాలు ఒకరు తెలుసుకుని, ఎవరు ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలో నిర్ణయించుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

పెళ్లి అంటే భయపడుతున్నారా? ఇది తెలుసుకోండి!
X

లైఫ్‌లో సెటిల్ అవ్వడం అంటే.. చదువుకుని, ఉద్యోగం సంపాదించి, మంచి అబ్బాయినో/ అమ్మాయినో చూసి పెళ్లి చేసుకోవడం. ఇదే మొన్నటిదాకా అందరి ఫార్ములా.. అయితే ఇప్పుడిప్పుడే రోజులు మారుతున్నాయి. వయసు పెరిగిపోతున్నా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉంటున్నారు చాలామంది. అదేమంటే ‘అంత రిస్క్ చేయలేం’ అంటున్నారు. ఇంతకీ పెళ్లి అంటే ఎందుకంత భయం? పెళ్లి నిజంగా మంచి ఆప్షనా? కాదా?

ప్రస్తుతం దేశంలోని యువత అంతా చదువు కంప్లీట్ చేసుకుని, ఉద్యోగాలు, వ్యాపారాలు, స్టార్టప్‌లు అంటూ కాంపిటీటివ్ వరల్డ్‌లో బిజీగా ఉంటున్నారు. ఇంట్లోవాళ్ళు పెళ్లి టాపిక్ ఎత్తితే. ‘ఇప్పుడే వద్దు’ అంటున్నారు. పోనీ ముప్పై దాటిన తర్వాత అడిగితే.. అప్పటికీ అదే మాట. పెళ్లి వద్దంటే వద్దంటున్నారు ఇప్పటి యూత్‌ అంతా. మ్యారేజ్ సిస్టమ్ మీద నమ్మకం లేకో లేదా పెళ్లి చేసుకోవడం నిజంగా ఇష్టం లేకో అయితే ఓకే. కానీ ఈ రోజుల్లో చాలామంది యువత పెళ్లి తర్వాత వచ్చే కొన్ని చిన్నచిన్న భయాలతోనే పెళ్లికి దూరంగా ఉంటున్నారట.

పార్ట్‌నర్ రాకతో కెరీర్, కలలు నెరవేరమోమో అన్న సందేహం, మంచి ఉద్యోగంతో జీవితంలో స్థిరపడాలనే కోరిక, పెళ్లి తర్వాత స్వేచ్ఛ ఉండదేమో అన్న భయం,పెళ్లితో వచ్చే బాధ్యతలంటే భయం, రాబోయే పార్ట్‌నర్ బిహేవియర్ ఎలా ఉంటుందో.. అనే అనుమానం, చాలా విషయాల్లో రాజీ పడాల్సొస్తుందనే ఆలోచన.. ఇలాంటి భయాల వల్లే చాలామంది పెళ్లికి దూరంగా ఉంటున్నారని సర్వేలు చెప్తున్నాయి.

అయితే పెళ్లికి ముందు ఇలాంటి భయాలు ఉండడం మామూలే అని, ఈ భయాల కోసం నిజంగా పెళ్లిని దూరం పెట్టకూడదని రిలేషన్‌షిప్ నిపుణులు అంటున్నారు. ప్రతీ ఒక్కరికీ ఎమోషనల్ సపోర్ట్ అవసరం. అందుకే డేటింగ్ అనో, లివింగ్ రిలేషన్ షిప్ అనో ఏదో ఒక రూపంలో తోడు కోరుకుంటున్నారు. కానీ, పెళ్లికి మాత్రం నో అంటున్నారు. దానికి కారణం పెళ్లి ఒక బాధ్యత కాబట్టి. దానిని ఫేస్ చేసే రిస్క్ చేయలేక చాలామంది పెళ్లికి దూరంగా ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి బాధ్యతలను అలవాటు చేయకపోవడం వల్లే ఈ సమస్య వస్తోంది.

బాధ్య‌త‌ల‌కు భయపడి పెళ్లికి దూరంగా ఉండకూడదు. బాధ్యతలు అన్ని విషయాల్లో ఉంటాయి. అందరూ పుట్టి పెరిగిన ఫ్యామిలీ సిస్టమ్ అనేదే ఓ సోషల్ రెస్పాన్సిబిలిటీ. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటే రెస్పాన్సిబిలిటీస్ పెరగడం కాదు, తగ్గుతాయి కూడా. ఒక్కోసారి ఇద్దరికీ కలిపి కొన్ని కామన్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాటిని చెరిసగం పంచుకుని ప్లాన్ చేసుకోవ‌చ్చు.పెళ్లి అయితే నా కెరీర్ ముగిసిపోతుందేమో, నా యాంబిషన్స్‌కి బాధ్యతలు అడ్డొస్తాయేమో అన్న భయం వ‌ద్దు. ఒక పక్క ఫ్యామిలీని, మరో పక్క ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేస్తూనే దేశం గర్వించదగ్గ సక్సెస్‌ను సాధించినవాళ్లు చాలామందే ఉన్నారు. కెరీర్ మీద నిజంగా అంత ప్యాషన్ ఉంటే దానికి పెళ్లి ఏ మాత్రం అడ్డుకాదు.

ఇకపోతే ప్రతి ఒక్కరికి కొన్ని పర్సనల్ గోల్స్ ఉంటాయి. పెళ్లి చేసుకుంటే అవన్నీ పక్కన పెట్టాల్సొస్తుందేమో, నేను పూర్తిగా మారిపోవాల్సి వస్తుందేమో అన్న భయం మొదలవుతుది. అయితే పార్ట్‌నర్‌‌ని రెండో వ్యక్తిగా కాకుండా.. మీ లైఫ్‌లో ఒక భాగం అని అర్థం చేసుకుంటే ఈ భయం ఉండదు.

పెళ్లి అంటే భయపడేవాళ్లు ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ తీసుకోవచ్చు. పెళ్లికి ముందే ఒకరి వ్యక్తిత్వాలు ఒకరు తెలుసుకుని, ఎవరు ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలో నిర్ణయించుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆఫీస్‌లో బాస్‌తో పడట్లేదని ఉద్యోగం మానేయం కదా.. అలాగే ఇది కూడా.. ఇష్యూ వచ్చినప్పుడు సాల్వ్ ఎలా చేయాలో ఆలోచించాలే తప్ప ప్రాబ్లెమ్ వస్తుందని ముందే భయపడడం మంచిది కాదు అనేది నిపుణుల అభిప్రాయం.

First Published:  23 March 2024 11:53 AM GMT
Next Story