Telugu Global
Health & Life Style

వింటర్‌‌ వచ్చేస్తుంది! బరువు పెరుగుతారు జాగ్రత్త!

చూస్తుండగానే చలికాలం వచ్చేసింది. సీజన్ మారేటప్పుడు శరీరంలో కూడా కొన్ని మార్పులొస్తాయి. ముఖ్యంగా చలికాలం వస్తే బరువు పెరుగుతారు అంటారు చాలామంది.

వింటర్‌‌ వచ్చేస్తుంది! బరువు పెరుగుతారు జాగ్రత్త!
X

చూస్తుండగానే చలికాలం వచ్చేసింది. సీజన్ మారేటప్పుడు శరీరంలో కూడా కొన్ని మార్పులొస్తాయి. ముఖ్యంగా చలికాలం వస్తే బరువు పెరుగుతారు అంటారు చాలామంది. అలాగే చలికాలంలో రకరకాల ఇన్ఫెక్షన్ల బెడద కూడా ఉంటుంది. మరి ఈ సీజన్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డైట్ ఎలా ఉండాలి?

చలికి, బరువు పెరగడానికి ఎలాంటి సంబంధం లేకపోయినా.. చలికాలంలో బద్ధకంగా అనిపించడం వల్ల ఎక్కువసేపు నిద్రపోవడం, వ్యాయామాన్ని స్కిప్ చేయడం వల్ల బరువుపై ఎఫెక్ట్ పడుతుంది. దాంతోపాటు స్నాక్స్, జంక్ ఫుడ్స్ లాంటివి కూడా తోడైతే తెలియకుండానే చలికాలం ముగిసేసరికి బరువు పెరిగిపోతారు. అందుకే చలికాలంలో ఉదయాన్నే కుదరకపోతే ఈవెనింగ్ టైంలో వ్యాయామం చేయాలి. స్నాక్స్, జంక్ ఫుడ్స్‌కు బదులు సూప్స్‌ వంటివి తీసుకోవాలి. చలిలో వెచ్చని సూప్స్ బాగుంటాయి.

చలికాలంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుందనుకుంటారు కొంతమంది. వెచ్చగా ఉండడం అటుంచితే ఆల్కహాల్లో ఉండే హై క్యాలరీలు బరువు పెరిగేలా చేస్తాయి. రకరకాల బ్లాడర్ సమస్యలొస్తాయి. కాబట్టి వీలైనంత వరకు చలికాలంలో ఆల్కహాల్‌కు దూరంగా ఉంటే మంచిది.

చలికాలంలో వ్యాయామం చేయడం ఇబ్బందిగా అనిపిస్తే డైట్‌లో ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్‌ని చేర్చుకోవచ్చు. బెర్రీస్, సిట్రస్ ఫ్రూట్స్, ఆకుకూరలు లాంటి ఫుడ్స్ డైట్‌లో చేర్చుకుంటే వ్యాయామం చేయకపోయినా కొంతవరకు ఫ్యాట్ కరిగించుకోవచ్చు. వాటితో పాటు బరువును తగ్గించుకోవడానికి ఉడికించిన ఆహారం, సలాడ్స్ ఎక్కువగా తినాలి. ఆయిల్ తక్కువ వాడాలి.

వింటర్‌‌లో తీసుకునే ఆహారాల్లో అల్లం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే.. అల్లంలో ఉండే గుణాల వల్ల చలికాలంలో కామన్‌గా వచ్చే జలువు , ఫ్లూ లాంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. వింటర్‌‌లో రోజూ పొద్దున్నే ఒక కప్పు అల్లం టీ తీసుకోవడం వల్ల ఫ్యాటీ ఫుడ్స్ జీర్ణం అయ్యి, ఎసిడిటీ తగ్గుతుంది. దాంతో పాటు టీలో తేనె కూడా కలిపితే ఇంకా మంచిది. తేనె.. చలికాలంలో వ్యాపించే బ్యాక్టీరియాను తట్టుకునేలా ఇమ్యూనిటీని పెంచుతుంది.

వింటర్‌‌లో శరీరానికి వెచ్చదనాన్నిచ్చే ఫుడ్స్‌లో వేరుశెనగ ఒకటి. వేరుశెనగ గుండెకు ఆక్సిజన్ అందే శాతాన్ని పెంచుతుంది. అసలే చలికాలంలో నిమ్ము వల్ల ఆక్సిజన్ సరిగా అందదు చాలామందికి. అలాంటి వాళ్లు డైట్ లో వేరుశెనగ తీసుకుంటే.. ఆక్సిజన్ లెవల్స్‌ను కొంతవరకూ బ్యాలెన్స్ చేయొచ్చు. అలాగే వింటర్‌‌లో షుగర్ కి బదులు బెల్లం వాడితే మంచిది. జలుబు, దగ్గు లాంటివి రాకుండా ఉంటాయి. బెల్లం శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకూ సాయపడుతుంది.

First Published:  24 Oct 2023 9:07 AM GMT
Next Story