Telugu Global
Health & Life Style

చలికాలం పిల్లలు జాగ్రత్త!

సాధారణంగా చల్లని వాతావరణం పిల్లలకు అంతగా పడదు. అందుకే చలికాలంలో పిల్లలకు జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తుంటాయి.

చలికాలం పిల్లలు జాగ్రత్త!
X

చలికాలం పిల్లలు జాగ్రత్త!

సాధారణంగా చల్లని వాతావరణం పిల్లలకు అంతగా పడదు. అందుకే చలికాలంలో పిల్లలకు జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ సీజన్‌లో పిల్లల్ని సేఫ్‌గా ఉంచడం కోసం ఏం చేయాలంటే..

చలి ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లల్ని వీలైనంతవరకూ వెచ్చగా ఉంచాల్సి ఉంటుంది. దానికోసం స్వెటర్లు, టోపీలు వంటివి ముందుగానే కొని పెట్టుకోవాలి. బయట ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు పిల్లలకు శరీరమంతా కవర్ అయ్యేలా వెచ్చని ఉన్ని దుస్తులు వేయాలి.

చలికాలంలో జలుబు, దగ్గు వంటివి రాకుండా ఉండేందుకు పిల్లలను ముందుగానే అప్రమత్తం చేయాలి. బయట స్వీట్లు, ఐస్‌క్రీమ్‌లు తినొద్దని , కూల్ డ్రింక్స్, ఐస్ వాటర్ తాగొద్దని చెప్పాలి. దానికి బదులు వెచ్చని సూప్స్, వేడివేడి కార్న్ వంటివి ఇవ్వొచ్చు.

పిల్లలు ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండాలంటే పరిశుభ్రతను పాటించడం ముఖ్యం. కాబట్టి పిల్లలకు రోజుకి రెండు సార్లు స్నానం చేయించాలి. అలాగే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. తినడానికి ముందు, తర్వాత చేతులను కడుక్కోమని అలవాటు చేయాలి. ఈ సీజన్‌లో పిల్లలను హైడ్రేటెడ్‌గా ఉంచాలి. అలాగే చర్మం పగలకుండా మాయిశ్చరైజర్స్ అప్లై చేస్తుండాలి.

పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచేందుకు తగిన ఆహారాన్ని ఇవ్వాలి. కాఫీ, టీ లకు బదులు పిల్లలకు పసుపు, మిరియాలు కలిపిన పాలు ఇస్తుండాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు ఇవ్వాలి.

ఈ సీజన్‌లో పిల్లలకు నిద్ర, వ్యాయామం కూడా ఎంతో అవసరం. పిల్లల్ని సాయత్రం సమయంలో ఆటలు ఆడించడం ద్వారా వాళ్లు అలసిపోయి త్వరగా నిద్రపోయేందుకు వీలుంటుంది.

శ్వాసకోస సమస్యలు, ఇన్ఫెక్షన్లు ఉన్న పిల్లలను ఈ సీజన్‌లో మరింత జాగ్రత్తగా గమనిస్తుండాలి. చల్లగాలులు తగలకుండా జాగ్రత్తపడాలి. వేళకు మందులు ఇవ్వాలి. చల్లని పదార్థాలు పెట్టకూడదు.

First Published:  31 Oct 2023 3:08 AM GMT
Next Story