Telugu Global
Health & Life Style

చలికాలం కీళ్ల నొప్పులు తగ్గాలంటే...

Winter joint pain Tips: చలికాలంలో కీళ్లు బిగుసుకుపోవడం అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. మామూలుగా వయసు పెరిగే కొద్దీ కీళ్లు అరిగి, నొప్పులు మొదలవుతాయి.

చలికాలం కీళ్ల నొప్పులు తగ్గాలంటే...
X

చలికాలం కీళ్ల నొప్పులు తగ్గాలంటే...

చలికాలంలో కీళ్లు బిగుసుకుపోవడం అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. మామూలుగా వయసు పెరిగే కొద్దీ కీళ్లు అరిగి, నొప్పులు మొదలవుతాయి. కానీ, ఇప్పుడు మారుతున్న లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్ కారణంగా చాలామందిలో చిన్న వయసు నుంచే కీళ్ల సమస్యలు మొదలవుతున్నాయి. చలికాలంలో అవి ఇంకా ఎక్కువవుతాయి. వీటి నుంచి రిలీఫ్ పొందడం ఎలాగంటే..

శరీరంలో కీళ్లు ఈజీగా కదలడానికి వాటిమధ్యలో మృదులాస్థి(కార్టిలేజ్), సయనోవియల్ ద్రావణం లాంటివి ఉంటాయి. కార్టిలేజ్‌లో నీటి శాతం తగ్గినప్పుడు లేదా సయనోవియల్ ద్రావణం పొడిబారినప్పుడు కీళ్లు కదలడం కష్టమవుతుంది. అప్పుడు విపరీతమైన నొప్పి పుడుతుంది.

చలికాలంలో వాతావరణంలోని చల్లదనానికి కీళ్లమధ్యలో ఉండే మృదువైన కార్టిలేజ్ కుచించుకుపోతుంది. సయనోవియల్ ఫ్లూయిడ్ చిక్కబడుతుంది. చర్మం, కండరాలు బిగుసుకుపోతాయి. అందుకే చాలామందికి చలికాలంలో కీళ్ల సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ఆడవాళ్లలో రక్తహీనత కారణంగా కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ఈ సీజన్‌లో శరీరాన్ని వీలైనంత వెచ్చగా ఉంచుకోవడానికి ట్రై చేయాలి.

కీళ్ల నొప్పులను తేలిగ్గా తీసుకోకూడదు. చలికాలంలో వచ్చే సాధారణ కీళ్ల నొప్పులను తగ్గించడానికి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఇంటి వాతావరణం ఎప్పుడూ వెచ్చగా ఉండేలా చూసుకోవాలి.

భుజాలు, తొడ కండరాలు గట్టిపడే వ్యాయామాలు చేస్తే కీళ్లపై ఒత్తిడి పడదు. అలాగే గంటల తరబడి కూర్చొని పనిచేసేవాళ్లు అప్పుడప్పుడు లేచి అటు ఇటు నడుస్తుండాలి.

నొప్పి నుంచి ఇన్‌స్టంట్ రిలీఫ్ కోసం వేడినీళ్ల కాపడం, మసాజ్, ఫిజియోథెరపీ వ్యాయామాలు లాంటివి ఉపయోగపడతాయి.

కీళ్ల అరుగుదల (ఆస్టియో ఆర్థరైటిస్‌), కీళ్లవాతం (రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌) లాంటి సమస్యలు ఉన్నవాళ్లు చలికాలంలో డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి.

కీళ్లు మరీ వీక్‌గా ఉన్నవాళ్లు డాక్టర్ల సలహా మేరకు క్యాల్షియం, విటమిన్‌ డి మాత్రలు వేసుకోవచ్చు.

ఇక వీటితోపాటు చలికాలంలో జంక్ ఫుడ్‌ తగ్గించి శరీరంలో వేడిని పెంచే ఫుడ్ తీసుకోవాలి. ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం, విటమిన్‌–డి, ప్రొటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. చల్లటి ఫుడ్స్‌ తగ్గించాలి.

కీళ్లను వెచ్చగా ఉంచుకునేందుకు మందపాటి బట్టలు వేసుకోవాలి. శరీరాన్ని చలికి ఎక్స్‌పోజ్ అవ్వకుండా చూసుకోవాలి.

First Published:  22 Nov 2022 9:35 AM GMT
Next Story