Telugu Global
Health & Life Style

వింటర్‌‌లో జుట్టు రాలకుండా..

Winter Hair Fall Tips: చలికాలంలో చర్మం మాదిరిగానే జట్టు ఆరోగ్యం కుడా దెబ్బతింటుంది. పొడి గాలి కారణంగా తలపైన చర్మం పొడిబారి జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది.

Winter Hair Fall Tips in Telugu
X

వింటర్‌‌లో జుట్టు రాలకుండా..

చలికాలంలో చర్మం మాదిరిగానే జట్టు ఆరోగ్యం కుడా దెబ్బతింటుంది. పొడి గాలి కారణంగా తలపైన చర్మం పొడిబారి జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది. చుండ్రు, దురద లాంటి సమస్యలు కూడా చలికాలంలో ఎక్కువవుతుంటాయి. మరి చలికాలంలో జుట్టు రాలకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే...

తలమీది చర్మం పొడిబారకుండా ఉండేందుకు చలికాలంలో తలకు నూనె ఎక్కువగా రాస్తుండాలి. తలకు, జుట్టుకు నూనె పట్టించి బాగా మసాజ్ చేయాలి. దీనివల్ల తలమీది చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. అలాగే విటమిన్‌– ఈ క్యాప్సూల్స్‌ను గోరువెచ్చటి నూనెలో వేసి బాగా కలిపి, తల నుంచి జట్టు మొదళ్లకు పట్టిస్తే జుట్టు రాలడాన్ని తగ్గించొచ్చు.

చలికాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటే చర్మం, జుట్టు కూడా తాజాగా ఉంటాయి. అలాగే తీసుకునే ఆహారం కూడా చర్మం, జుట్టుపై నెగెటివ్ ప్రభావాన్ని చూపుతుంది. అందుకే విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు ఉండేలా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా జుట్టు ఆరోగ్యం కోసం ఆకుకూరలు, కరివేపాకు, సీజనల్‌ పండ్లు, కూరగాయలు తప్పక తీసుకోవాలి.

హెయిర్ డ్రయ్యర్ ఎక్కువగా వాడడం వల్ల జుట్టు కుదుళ్లలో తేమ తగ్గుతుంది. అందుకే చలికాలం హెయిర్ డ్రయ్యర్, హెయిర్ స్ట్రైటెనింగ్, కర్లింగ్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు జుట్టు పొల్యూషన్‌కు ఎక్స్‌పోజ్ అవ్వకుండా జాగ్రత్తపడాలి.

First Published:  26 Dec 2022 1:12 PM GMT
Next Story