Telugu Global
Health & Life Style

చలికాలం చుండ్రు రాకుండా...

Winter Dandruff: చలికాలం చుండ్రు సమస్య చాలామందిని వేధిస్తుంటుంది. పొల్యూషన్, హెల్మెట్ వాడకం లాంటి కారణాల వల్ల చాలామందిలో డాండ్రఫ్ సమస్య కామన్ అయిపోయింది. చుండ్రు సమస్యను అలాగే వదిలేస్తే వెంట్రుకలు రాలిపోయే ప్రమాదం ఉంటుంది.

చలికాలం చుండ్రు రాకుండా...
X

చలికాలం చుండ్రు రాకుండా...

చలికాలం చుండ్రు సమస్య చాలామందిని వేధిస్తుంటుంది. పొల్యూషన్, హెల్మెట్ వాడకం లాంటి కారణాల వల్ల చాలామందిలో డాండ్రఫ్ సమస్య కామన్ అయిపోయింది. చుండ్రు సమస్యను అలాగే వదిలేస్తే వెంట్రుకలు రాలిపోయే ప్రమాదం ఉంటుంది. దీనికి ఎలా చెక్ పెట్టొచ్చంటే..

పొడి చర్మం ఉన్నవాళ్లకు చలికాలం చుండ్రు ఎక్కువవుతుంది. వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల స్కాల్ప్ పొడిగా, పొరలుగా మారుతుంది. ఇలాంటి వాళ్లు మాయిశ్చరైజింగ్‌ షాంపూలు వాడితే కొంత ఉపయోగం ఉంటుంది. అలాగే జుట్టుకు కలరింగ్‌, డైయింగ్‌, పెర్మింగ్‌ లాంటివి చేయడం తగ్గించాలి.

ఎగ్జిమా, సోరియాసిస్‌ లాంటి చర్మ సమస్యలు ఉన్నప్పుడు కూడా డాండ్రఫ్‌ సమస్య వస్తుంటుంది. పొడిబారిన చర్మం, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్, పొల్యూషన్, చర్మంలో సెబమ్‌ ఎక్కువగా ఉండటం.. ఇలా డాండ్రఫ్ కు చాలా కారణాలుండొచ్చు. అయితే రెగ్యులర్‌గా నూనెతో తలను మసాజ్ చేయడం వల్ల జుట్టుకి పోషణ అందుతుంది . అలాగే చుండ్రును తగ్గించడంలో కొన్ని ఆహారాలు సూపర్‌‌గా పనిచేస్తాయి.

చేపలు తినడం ద్వారా చుండ్రును తగ్గించొచ్చు. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు మందంగా ఉంచేందుకు, పెరుగుదలకు సహాయపడతాయి. అలాగే గుడ్లలో ఉండే జింక్, బయోటిన్ కూడా చర్మంపై ఉండే స్కాల్ప్ తగ్గించి జుట్టు ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి.

జుట్టు ఆరోగ్యానికి మోనో అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు కూడా ముఖ్యం. ఇవి ఆవకాడో, ఆలివ్ ఆయిల్, వేరుశెనగ నూనె, అవిసె గింజలు వంటి వాటిలో ఎక్కువగా ఉంటాయి.

సహజంగా కొవ్వులు అందాలంటే గింజలు బెస్ట్ ఆప్షన్. రకరకాల గింజలు, పప్పుల్లో జింక్, ఇతర విటమిన్లు, పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి సహజమైన కొవ్వులను అందించి చుండ్రును తగ్గించడంలో సాయపడతాయి.

వీటితో పాటు అరటిపండు , పెరుగు లాంటి ప్రోబయోటిక్ ఫుడ్స్ కూడా చుండ్రు తగ్గడానికి సాయపడతాయి. చర్మ సమస్యలను తగ్గించే విటమిన్– సి, సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల కూడా చుండ్రు తగ్గుతుంది.

First Published:  15 Dec 2022 12:25 PM GMT
Next Story