Telugu Global
Health & Life Style

చలికాలం ముక్కు దిబ్బడ తగ్గాలంటే..

చలికాలం వచ్చిందంటే ముక్కు దిబ్బడ వేధిస్తుంది. జలుబు చేసి ముక్కులు రెండూ మూసుకుపోతుంటాయి. దీంతో శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం పొందొచ్చు.

చలికాలం ముక్కు దిబ్బడ తగ్గాలంటే..
X

చలికాలం వచ్చిందంటే ముక్కు దిబ్బడ వేధిస్తుంది. జలుబు చేసి ముక్కులు రెండూ మూసుకుపోతుంటాయి. దీంతో శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం పొందొచ్చు. అదెలాగంటే..

ముక్కు దిబ్బడను తగ్గించేందుకు ఆయుర్వేదంలో మంచి పద్ధతి ఉంది. అదే ఆవిరి పట్టడం. ఆవిరి పట్టడం వల్ల మూసుకుపోయిన ముక్కు రంధ్రాలు వెంటనే తెరుచుకుంటాయి. దీనికోసం ఒక పాత్రలో నీటిని మరిగించి అందులో యూకలిప్టస్ ఆకులు లేదా పెప్పర్ మెంట్ ఆయిల్/జండూబామ్ లాంటిది కొద్దిగా వేసి తలను టవల్‌తో కప్పి ఆవిరి తీసుకోవాలి. ఇలా చేస్తే ముక్కు దిబ్బడ నుంచి ఇన్‌స్టంట్ రిలీఫ్ ఉంటుంది.

ముక్కు నుంచి నీరు కారుతుంటే తరచూ ముక్కును శుభ్రం చేసుకుంటూ ఉండాలి. గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలి.

రెండు, మూడు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని బాగా నలిపి వాటిని అలాగే తిన్నా లేదంటే వాటిని మెత్తగా పేస్ట్‌లా చేసి గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగినా ముక్కు దిబ్బడ తగ్గుతుంది.

ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో రెండు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను వేసి బాగా కలిపి రోజుకు మూడు సార్లు తాగాలి. ఇలా చేస్తే ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది.

గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీ, అల్లం టీ వంటి వాటిని తీసుకోవడం వల్ల వాటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ముక్కు దిబ్బడ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

నిమ్మరసం, నల్ల మిరియాల పొడిని కలిపి ముక్కుపై రాస్తే ముక్కు దిబ్బడ తగ్గుతుంది. యూకలిప్టస్‌ లేదా లవంగం వంటి నూనెల సారాన్ని పీల్చడం ద్వారా ముక్కులో ఉన్న కఫాన్ని తొలగించుకోవచ్చు.

కాస్త కారంగా ఉండే వేడివేడి సూప్స్‌ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కఫం మెత్తబడి బయటకొస్తుంది.

విటమిన్‌ సీ జలుబుని తగ్గిస్తుంది. అందుకే ఆరెంజ్, నిమ్మరసాలను తరచూ తీసుకుంటుండాలి.

ముక్కు దిబ్బడతో బాధపడే వారు వీలైనంత వరకు పాలు, పాల ఉత్పత్తులను దూరం పెట్టాలి. ధూమపానం అలవాటును మానుకోవాలి.

First Published:  21 Nov 2022 11:56 AM GMT
Next Story