Telugu Global
Health & Life Style

సమ్మర్‌‌లో మామిడి పండు ఎందుకు తినాలంటే..

సమ్మర్‌‌లో మాత్రమే దొరికే అరుదైన సీజనల్ ఫ్రూట్ మ్యాంగో. అటు రుచిలోనూ ఇటు ఆరోగ్యంలోనూ దీన్ని తలదన్నే ఫ్రూటే లేదు.

సమ్మర్‌‌లో మామిడి పండు ఎందుకు తినాలంటే..
X

సమ్మర్‌‌లో మాత్రమే దొరికే అరుదైన సీజనల్ ఫ్రూట్ మ్యాంగో. అటు రుచిలోనూ ఇటు ఆరోగ్యంలోనూ దీన్ని తలదన్నే ఫ్రూటే లేదు. అందుకే దీన్ని పండ్లలో రారాజు అంటుంటారు. సమ్మర్‌‌లో మామిడి పండ్లు తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడిపండ్లలో బోలెడు విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఓవరాల్ హెల్త్‌ను ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే ఇందులో 80 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. రోజుకో మామిడి పండు తినడం ద్వారా డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవచ్చు.

మామిడి పండ్లలో ఉండే ‘ఎ’,‘సి’ విటమిన్లు, బీటా కెరోటిన్లు శరీరంలోని ఇమ్యూనిటీని పెంచి, సమ్మర్‌‌లో వచ్చే అనారోగ్యాలను నివారించడంలో సాయపడతాయి. మామిడి పండ్లలో ఉండే ‘ఎ’,‘సి’ విటమిన్లు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమ్మర్‌‌లో చర్మం పాడవ్వకుండా కాపాడతాయి. స్కిన్ డిటాక్స్‌కు కూడా మామిడి పండ్లు మేలు చేస్తాయి.

ఎనీమియా(రక్తహీనత)తో బాధపడుతున్నవాళ్లకు మామిడి పండ్లు మేలు చేస్తాయి. వీటిలో ఉండే హై ఐరన్ కంటెంట్ శరీరంలో ఎర్ర రక్తకణాల వృద్ధిని పెంపొందిస్తుంది. అలాగే ఇవి రక్తపోటు సమస్యను కూడా నివారించగలవు. మామిడి పండ్లలో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ రక్తపోటును కంట్రోల్‌లో ఉండేలా చేస్తాయి.

మామిడి పండ్లు తినడం ద్వారా ఎముకల బలహీనతను తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే రిచ్ క్యాల్షియం ఎముకల సాంద్రతను పెంచి బోన్స్ స్ట్రాంగ్ గా తయారయ్యేలా చూస్తుంది. అలాగే మ్యాంగోస్ లో ఉండే ప్రొబాటిక్ నేచర్ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఇకపోతే మామిడి పండ్లలో క్యాలరీలు కూడా తక్కువే. కాబట్టి బరువు పెరిగే అవకాశం లేదు. షుగర్ ఉన్నవాళ్లు కూడా మితంగా వీటిని తీసుకోవచ్చు. అయితే సమ్మర్‌‌లో మామిడి పండ్లు మంచివే అయినా అతిగా తినడం వల్ల కొంత నష్టం ఉండొచ్చు. కాబట్టి వీటిని మితంగా తీసుకోవాలి. అలాగే వీటిని తినేముందు శుభ్రంగా కడుక్కోవడం చాలా ముఖ్యం.

First Published:  9 April 2024 4:06 AM GMT
Next Story