Telugu Global
Health & Life Style

ఈజీగా బరువు తగ్గించే 30–30–30 రూల్!

బరువు తగ్గించుకోవడం కోసం రకరకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అయితే సింపుల్‌గా బరువు తగ్గించే 30–30–30 రూల్ ఒకటి ఇప్పుడు పాపులర్ అవుతోంది.

ఈజీగా బరువు తగ్గించే 30–30–30 రూల్!
X

బరువు తగ్గించుకోవడం కోసం రకరకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అయితే సింపుల్‌గా బరువు తగ్గించే 30–30–30 రూల్ ఒకటి ఇప్పుడు పాపులర్ అవుతోంది. ఈ రూల్‌ను పాటించడం ఎంతో ఈజీ.

బరువు తగ్గడం కోసం కొందరు వ్యాయామాలు, ఇంకొందరు డైట్ ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వెయిట్ లాస్ కోసం చేయాల్సిన పనులను బ్యాలెన్సింగ్ క్రమంలో అమర్చి ఒక రూల్ డిజైన్ చేశారు నిపుణులు. అదే 30–30–30 రూల్. ఈ రూల్‌లో భాగంగా రోజుకి మూడు ముప్పై నిముషాలు.. అంటే గంటన్నర సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఈ మూడు ముప్పై నిముషాల్లో ఏం చేయాలంటే..

అధిక బరువుని తగ్గించుకోవాలంటే ముఖ్యంగా మూడు నియమాలు పాటించాలి. అదే వ్యాయామం, ఆహారం, ఒత్తిడి లేని జీవితం. ఈ మూడింటిలో ఒక్కోదానికి ముప్పై నిముషాల పాటు సమయాన్ని కేటాయించడమే ఈ రూల్ ముఖ్య ఉద్దేశం.

30 మినిట్స్ వర్కవుట్

30–30–30 రూల్‌లో భాగంగా ముందుగా రోజుకి ముప్ఫై నిముషాల పాటు వ్యాయామం చేయాలి. వాకింగ్, జాగింగ్, జిమ్, యోగా, స్ట్రెచింగ్ ఇలా ఏ రకమైన వ్యాయామం అయినా ఎంచుకోవచ్చు. కానీ, అరగంట సేపు తప్పక వ్యాయామం చేయాలి. బరువు తగ్గాలంటే కచ్చితంగా రోజుకి కొంత శారీరక శ్రమ ఉండాలి. అప్పుడే శరీరపు మెటబాలిజం పెరిగి అదనపు క్యాలరీలు కరుగుతాయి.

30 శాతం క్యాలరీలు కట్!

ఇక రెండో రూల్ తీసుకునే ఆహారంలో 30 శాతం తగ్గించాలి. రోజుకి ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నారో లెక్కించుకుని అందులో 30 శాతం తగ్గించి తీసుకునేలా డైట్ ప్లాన్ చేసుకోవాలి. వీటిలో కొవ్వు పదార్థాలు లేకుండా చూసుకుంటే ఇంకా మంచిది. అదనపు క్యాలరీలు తగ్గించినప్పుడే క్రమంగా కొవ్వు కరిగి బరువు తగ్గడం మొదలవుతుంది.

30 మినిట్స్ రెస్ట్

ఇక మూడో రూల్ ఏంటంటే రోజులో ముప్ఫై నిముషాల పాటు ప్రశాతంగా గడపడాన్ని అలవాటు చేసుకోవాలి. రోజంతా ఆనందంగా గడిపితే ఇంకా మంచిది. అయితే ఒత్తిడితో కూడిన లైఫ్‌స్టై్ల్ ఉన్నవాళ్లు రోజులో ఓ అరగంట ఖాళీగా కూర్చొని రిలాక్స్ అవ్వాలి. తేలికపాటి సంగీతం వినొచ్చు. ధ్యానం చేయొచ్చు. ఈ ముప్ఫై నిముషాలు ఎలాంటి ఆలోచనలు చేయొద్దు. మొబైల్/ గ్యాడ్జెట్లు అస్సలు ముట్టుకోవద్దు. ఒత్తిడి తగ్గనంత వరకూ బరువు తగ్గడం కుదరదు. కాబట్టి ప్రశాంతతను అలవాటు చేసుకోవడం ముఖ్యం.

First Published:  22 Nov 2023 2:27 AM GMT
Next Story