Telugu Global
Health & Life Style

నాన్ వెజిటేరియన్స్‌లోనూ బీ12 లోపం!

సాధారణంగా మాంసాహారంలో విటమిన్ బీ12 ఎక్కువగా ఉంటుంది. అందుకే శాఖాహారుల్లో బీ12 లోపం ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే తాజాగా చేసిన కొన్ని స్టడీల్లో నాన్ వెజీటేరియన్లలో కూడా విటమిన్ బీ12 డెఫీషియన్సీ ఉండే అవకాశం ఉందని తేలింది.

నాన్ వెజిటేరియన్స్‌లోనూ బీ12 లోపం!
X

సాధారణంగా మాంసాహారంలో విటమిన్ బీ12 ఎక్కువగా ఉంటుంది. అందుకే శాఖాహారుల్లో బీ12 లోపం ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే తాజాగా చేసిన కొన్ని స్టడీల్లో నాన్ వెజీటేరియన్లలో కూడా విటమిన్ బీ12 డెఫీషియన్సీ ఉండే అవకాశం ఉందని తేలింది. వివరాల్లోకి వెళ్తే..

తరచుగా నాన్ వెజ్ తింటున్నటప్పటికీ.. వంట చేసే పద్ధతులు, వంట కోసం వాడే పాత్రలు, స్మోకింగ్, డ్రింకింగ్, కాయగూరలు మరీ తక్కువగా తినడం.. ఇలా పలు కారణాల వల్ల నాన్ వెజిటేరియన్స్‌లో కూడా బీ12 లోపం ఉండే అవకాశం ఉందని తమిళనాడుకి చెందిన ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్’ సైంటిస్టులు చేసిన అధ్యయనంలో తేలింది.

20 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సులో ఉండి విటమిన్ బీ12 లోపంతో బాధపడుతున్న 200 మందితో ఈ అధ్యయనం చేశారు. వారి ఆహారపు అలవాట్లు, ఇతర హ్యాబిట్స్‌ను తెలుసుకుని ఒక రిపోర్ట్ తయారుచేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం బీ12 లోపం ఉన్న వారిలో వెజిటేరియన్లకు, నాన్ వెజిటేరియన్లకు మధ్య ఎలాంటి వ్యత్యాసం కనిపించలేదు. ముఖ్యంగా ప్యాకెట్ పాలు తాగే వాళ్లలో, వేయించిన పదార్థాలు ఎక్కువగా తినేవాళ్లలో, స్మోకింగ్, డ్రింకింగ్, కెఫినేటెడ్ డ్రింక్స్ వంటి అలవాట్లున్నవాళ్లలో, డయాబెటిస్, బీపీ వంటి వ్యాధులున్నవాళ్లలో బీ12 లోపం ఎక్కువగా కనిపించింది. కాబట్టి వెజిటేరియన్లలో మాత్రమే బీ12 లోపం ఉంటుందనడం సరి కాదని, నాన్ వెజ్ ఎక్కువగా తింటే బీ12 లోపం రాదు అన్న నిర్థారణకు రాలేము అని సైంటిస్టులు పేర్కొన్నారు.

బీ12 లోపం అంటే..

బీ12 అనేది బీ కాంప్లెక్స్ విటమిన్స్‌లో ముఖ్యమైన విటమిన్. ఇది మెదడు, నరాల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంచుతుంది. అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడడానికి కూడా బీ12 కీలకంగా పనిచేస్తుంది. శరీరంలో విటమిన్ బీ12 లోపం ఉంటే నీరసంగా అనిపిస్తుంది. గుండెదడ, ఒత్తిడి వంటివి కనిపిస్తాయి. తిమ్మిర్లు పట్టడం, చర్మం పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డెమెన్షియా, మానసిక సమస్యలు, డయాబెటిస్, చర్మ వ్యాధులకు కూడా బీ12 డెఫిషియన్సీ కారణమవ్వొచ్చు. బీ12 డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే పాలు, తృణధాన్యాలు, రెడ్ మీట్, చేపలు, పీతలు, సోయాబీన్స్, గుడ్లు, ఆకుకూరల వంటివి తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి. స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లు మానుకోవాలి.

First Published:  29 Aug 2023 7:30 AM GMT
Next Story