Telugu Global
Health & Life Style

ఆరోగ్యంగా ఉండాలంటే… పరగడుపున ఇవి తినండి!!

చాలామంది పరగడుపున పచ్చి కూరగాయలను తింటూ ఉంటారు. అది కూడా మంచిది కాదని చెబుతున్నారు డైటీషియన్లు. వీటిలో ఫైబర్, అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయని, దీనివల్ల అవి జీర్ణం కాకుండా, అనవసరమైన జీర్ణ సమస్యలు వస్తాయంటున్నారు.

ఆరోగ్యంగా ఉండాలంటే… పరగడుపున ఇవి తినండి!!
X

పొద్దున్న లేచిన వెంటనే చాలామందికి ఆకలి వేస్తుంది. కానీ, ఏం తినాలి? ఏం తినకూడదు? అన్న విషయాలను మాత్రం పెద్దగా పట్టించుకోకుండా ఏదో ఒకటి తినేసేవారు కొందరైతే.. అలవాటు ప్రకారం కాఫీ, టీ తాగేసేవారు కొందరు. కానీ, అలా ఒక ప్లాన్ లేకుండా తింటే అనవసరమైన అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నట్టు అవుతుందని చెబుతున్నారు డైటీషియన్లు. పరగడుపున ఏది పడితే అది తింటే జీర్ణవ్యవస్థ ఎఫెక్ట్ అవుతుందని, అందుకే ఉదయం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.




ఉదయం లేవగానే టీ గానీ, కాఫీ గానీ పడకపోతే కొందరికి ఏ పని చెయ్యాలని అనిపించదు. కానీ నిజానికి అలా తాగితే కడుపులో యాసిడ్స్ ఉత్పత్తి, రక్తంలో చక్కెర్ స్థాయి అమాంతం పెరిగిపోతాయట. కాబట్టి ఉదయం మౌత్ వాష్ చేసుకోగానే కాసిన్ని నీళ్లు తాగాలి. ఆ తర్వాతే ఏదైనా ఆహారం, పానీయాలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. అసలు ఉదయం కాఫీ, టీలు కాకుండా ఇంట్లో చేసుకొనే హెల్త్ డ్రింక్స్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మధుమేహం, బీపీ, అధిక బరువు, శరీరంలోని వ్యర్థాలు బయటకు పోవటం వంటి ఉపయోగాలుంటాయట. అంతేకాదు రోజంతా హెల్దీగా, యాక్టీవ్ గా ఉంటారు. అలాగే పరగడుపున తీసుకునే ఆహారం ఎప్పుడు ఈజీగా డైజెస్ట్ అయ్యేదై ఉండాలి. అలా అని పుల్లటి వస్తువులను తీసుకోకూడదు. వీటిలో ఉండే యాసిడ్స్ ఎసిడిటీకి, కడుపులో అల్సర్ కు కారణం అవుతాయి.

ఇక చాలామంది పరగడుపున పచ్చి కూరగాయలను తింటూ ఉంటారు. అది కూడా మంచిది కాదని చెబుతున్నారు డైటీషియన్లు. వీటిలో ఫైబర్, అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయని, దీనివల్ల అవి జీర్ణం కాకుండా, అనవసరమైన జీర్ణ సమస్యలు వస్తాయంటున్నారు.




పొద్దున్న లేవగానే తినడానికి అనువుగా ఉండే వాటిలో ఓట్ మీల్ ఒకటి. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్స్ ఎనర్జీని పెంచుతాయి. అలాగే ఇందులోని ఫైబర్ పొట్ట నిండిన అనుభూతి కూడా కలిగిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఇంకా పరగడపున తినడానికి ఎగ్స్, బ్లూ బెర్రీస్, నట్స్, ఖర్జుర, బాదం కూడా చాలా మంచివి. ఇక జీర్ణశక్తిని పెంచడంలో, ఎనర్జీలెవల్స్, ఆకలిని పెంచడంలో లెమన్ వాటర్ సహాయపడుతుంది. అలాగే పుచ్చకాయ, బొప్పాయి, జామ, మామిడి, దానిమ్మ పండ్లను పరగడపున తినొచ్చు. అయితే ఇలా ఏదో ఒకటి తిన్నాం కదా అని ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ అస్సలు మిస్ చేయొద్దు. కచ్చితంగా రోజూ ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ తినాల్సిందే.

First Published:  30 Sep 2023 8:01 AM GMT
Next Story