Telugu Global
Health & Life Style

ప్రెగ్నెన్సీ సమయంలో జబ్బులు రాకూడదంటే..

ప్రెగ్నెన్సీ సమయంలో కొంతమందికి బీపీ, థైరాయిడ్, డయాబెటిస్ వంటి సమస్యలు మొదలవుతుంటాయి.

ప్రెగ్నెన్సీ సమయంలో జబ్బులు రాకూడదంటే..
X

ప్రెగ్నెన్సీ సమయంలో జబ్బులు రాకూడదంటే..

ప్రెగ్నెన్సీ సమయంలో కొంతమందికి బీపీ, థైరాయిడ్, డయాబెటిస్ వంటి సమస్యలు మొదలవుతుంటాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. వీటికి గల కారణాలేంటి? ప్రెగ్నెన్సీ సమయంలో బీపీ, షుగర్ లాంటి జబ్బులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ప్రెగ్నెన్సీ టైంలో కూడా సెడెంటరీ లైఫ్‌స్టైల్‌నే మెయింటెయిన్ చేయడం వల్ల గర్భిణుల్లో డయాబెటిస్, బీపీ వంటివి తలెత్తుతున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. ఆరు గంటల కంటే తక్కువ నిద్ర పోవడం, రోజంతా కూర్చొని పనిచేయడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడికి లోనవ్వడం, రాత్రి వేళల్లో పని చేయడం, పోషకాహారం తీసుకోకపోవడం వంటి అలవాట్లుంటే దాన్ని సెడెంటరీ లైఫ్‌స్టైల్ అంటారు. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం ఇలాంటి లైఫ్‌స్టైల్‌కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యం, మానసిక స్థితి.. బిడ్డపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి, వీలైనంత వరకూ ఒత్తిడి లేని లైఫ్‌స్టైల్ పాటించాలి. పోషకాహారం తీసుకోవాలి. వేళకు నిద్రపోవాలి. ఆహారంలో కాయగూరలు, పండ్లు, నట్స్, పాలు వంటివి ఎక్కువ ఉండాలి. ప్రొటీన్‌, ఫైబర్‌ ఎక్కువగా ఉండే డైట్ తీసుకోవాలి. రోజులో ఎంతో కొంత శరీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. కనీసం వాకింగ్ అయినా చేస్తుండాలి. ప్రెగ్నెన్సీ టైంలో ఎప్పటికప్పుడు డాక్టర్‌‌ను కలుస్తూ.. తగిన పరిక్షలు చేయిస్తుండాలి.

ఇకపోతే తల్లిదండ్రులు కావాలని నిర్ణయించుకునే ముందు దంపతులు ప్రీప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్ తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. ఈటైంలో డాక్టర్లు కుటుంబ చరిత్రను బట్టి బీపీ, డయాబెటిస్‌ వంటివి వచ్చే అవకాశం ఉందేమో పరిశీలిస్తారు. పీసీఓఎస్‌ సమస్య ఉంటే తగిన జాగ్రత్తలు సూచిస్తారు. అలాగే తల్లి ఆరోగ్యాన్ని బట్టి కొన్ని విటమిన్ సప్లిమెంట్లు లేదా డైట్ ప్లాన్ వంటివి సూచిస్తారు.

జాగ్రత్తలు ఇలా..

గర్భిణీ స్త్రీలు జంక్‌ఫుడ్‌, కూల్‌డ్రింక్స్ జోలికి వెళ్లకూడదు. డైట్‌లో తాజా కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి.

ప్రొటీన్స్, ఫైబర్, మినరల్స్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తినాలి.

ఐరన్ లోపం రాకుండా ఉండేందుకు నువ్వులు, బెల్లం, రాగులు వంటివి తీసుకోవాలి.

ఒత్తిడి, డిప్రెషన్‌ వంటి సమస్యలు వేధిస్తుంటే తగిన కౌన్సెలింగ్ తీసుకోవాలి.

First Published:  28 Oct 2023 5:30 AM GMT
Next Story