Telugu Global
Health & Life Style

వేసవిలో ఫ్రిజ్​ వాటర్ తాగితే జరిగేదిదే..

ఎండలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత.. ఫ్రిజ్ లోంచి వాటర్ బాటిల్ తీసుకుని తాగడం చాలా మందికి అలవాటు. హాయిగా ఉండటం కోసం ఐస్ వేసుకుని జ్యూస్‌లు, చిల్డ్ కూల్ డ్రింక్స్ తీసుకుంటారు.

వేసవిలో ఫ్రిజ్​ వాటర్ తాగితే జరిగేదిదే..
X

ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు వెళ్లి రావటమే కాదు ఇంట్లో ఉన్న కూడా శరీరం విపరీతంగా అలసటకు లోనవుతోంది. ఈ సమయంలో పుష్కలంగా నీరు తాగడం చాలా అవసరం. ఎండలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత.. ఫ్రిజ్ లోంచి వాటర్ బాటిల్ తీసుకుని తాగడం చాలా మందికి అలవాటు. హాయిగా ఉండటం కోసం ఐస్ వేసుకుని జ్యూస్‌లు, చిల్డ్ కూల్ డ్రింక్స్ తీసుకుంటారు. ఒక పనిగా పెట్టుకొని బాటిల్స్ నింపి కూల్ చేసుకుని మ‌రీ తాగుతారు. అయితే, అలా చేస్తే ఆరోగ్యానికి హానిక‌రం అని చెప్తున్నారు డాక్ట‌ర్లు.

నిజానికి ఎండలో వెళ్లి వచ్చిన వెంటనే.. ఇలా చల్లటి నీళ్లు తాగడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. వేడిని తొలగిస్తుంది. కానీ, ఇది కేవలం స్వల్పకాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తుంది. ఈ సమయంలో చల్లటి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం. చల్లటి నీరు శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చల్లని నీటి వల్ల గొంతు నొప్పి, దగ్గు, జలుబు.. వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. పంటి సమస్యలు కూడా ఏర్పడతాయి.

చల్లటి నీరు మీ జీర్ణవ్యవస్థపై త్వరిత ప్రభావాన్ని చూపుతుంది. నిరంతరం చల్లటి నీటిని తాగడం వల్ల ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది. ఇది కడుపు నొప్పి, వికారం, మలబద్ధకం వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. చల్లటి నీరు శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఉండకపోవడం వల్ల ఫుడ్ ప్రాసెస్ చేయ‌డంలో కూడా ఇబ్బందులు త‌లెత్తుతాయి.

చాలా మంది ఫ్రిజ్​లో చల్లటి నీళ్లు తాగి.. పని మీద బయటకు వెళ్తుంటారు. ఇలా చేయడం వల్ల ఒంట్లోని చల్లటి నీరు.. బయటి ఎండ తీవ్రత బ్యాలెన్స్​ తప్పడం వల్ల.. వడ దెబ్బ తగులుతుంది.

చ‌ల్ల‌టి నీళ్లు తాగితే..గుండెలోని వాగస్‌ నరాలపై ప్రభావం చూపిస్తుంది. దీని ద్వారా గుండె పనితీరు నెమ్మదిస్తుంది.. హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. ఫలితంగా గుండెపోటు వచ్చే ఛాన్స్‌ కూడా ఉంటుంది. అందుకే హృద్రోగులు చల్లటి నీళ్లకు దూరంగా ఉండటమే మంచిదని వైద్యులు సూచిస్తుంటారు.

బరువు తగ్గాలని అనుకునేవారు చల్లటి నీటికి దూరంగా ఉండటం మంచిది. చల్లటి నీరు తాగడం వల్ల శరీరంలోని కొవ్వును కరిగించడం కష్టమవుతుంది. పైగా కొవ్వు మరింత బలంగా మారడంతో అంత ఈజీగా బరువు తగ్గలేరు.

First Published:  29 April 2024 12:59 PM GMT
Next Story