Telugu Global
Health & Life Style

క్రికెటర్ల ఫిట్‌నెస్ ఫార్ములా ఇదే..

వరల్డ్ కప్ మ్యాచుల్లో మనోళ్లు అదరగొడుతున్నారు. మెరుగైన బ్యాటింగ్ ఆర్డర్‌‌తో పాటు మెరుపు బౌలింగ్‌తో బడా టీమ్స్‌ను కూడా బోల్తా కొట్టిస్తున్నారు. అయితే టీమిండియా సక్సెస్‌కు వాళ్ల ఫిట్‌నెస్ కూడా ఓ కారణమని చెప్పాలి.

క్రికెటర్ల ఫిట్‌నెస్ ఫార్ములా ఇదే..
X

క్రికెటర్ల ఫిట్‌నెస్ ఫార్ములా ఇదే..

వరల్డ్ కప్ మ్యాచుల్లో మనోళ్లు అదరగొడుతున్నారు. మెరుగైన బ్యాటింగ్ ఆర్డర్‌‌తో పాటు మెరుపు బౌలింగ్‌తో బడా టీమ్స్‌ను కూడా బోల్తా కొట్టిస్తున్నారు. అయితే టీమిండియా సక్సెస్‌కు వాళ్ల ఫిట్‌నెస్ కూడా ఓ కారణమని చెప్పాలి. మన క్రికెటర్ల ఫిట్‌నెస్ వెనుక సీక్రెట్స్‌ ఏంటో మనమూ తెలుసుకుందామా!

స్పోర్ట్స్ పర్సన్స్‌కు, అథ్లెట్స్‌కు ఫిట్‌నెస్ అనేది డైలీలైఫ్‌లో భాగం. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు కాబట్టే వాళ్లు ఎప్పడూ ఫిట్‌గా ఉంటారు. అయితే వర్కవుట్స్ ఎంపికలో ఒక్కొక్కరిదీ ఒక్కోరకం. హై ఇంటెన్సిటీ వర్కవుట్స్ నుంచి యోగా వరకూ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ ఫాలో అవుతుంటారు.

స్ట్రెంత్ ట్రైనింగ్

కార్డియో స్ట్రెంత్ పెంచడానికి స్ట్రెంత్ ట్రైనింగ్ వర్కవుట్లు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఎండ్యూరెన్స్‌ను పెంచుకునేందుకు ఇలాంటి వర్కవుట్స్‌ను ఎంచుకుంటారు ప్లేయర్లు. ఇందులో పులప్స్, పుషప్స్, స్క్వాట్స్, బెంచ్ ప్రెస్, రన్నింగ్, సైక్లింగ్, బాడీ వెయిట్ వర్కవుట్స్ వంటి వ్యాయామాలుంటాయి. రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ స్ట్రెంత్ ట్రైనింగ్ వ్యాయామాలు ఎక్కువ చేస్తారు.

జిమ్ వర్కవుట్స్

జిమ్ వర్కవుట్స్ చాలామందికి ఫేవరెట్. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, కెఎల్ రాహుల్ , కుల్‌దీప్ యాదవ్ వంటి వాళ్లంతా రోజూ జిమ్ వర్కవుట్స్ చేస్తారు. ఇందులో స్ట్రెంత్ ట్రైనింగ్ నుంచి వెయిట్ లిఫ్టింగ్ వరకూ అన్నిరకాల వర్కవుట్స్ చేయొచ్చు. ఇందులో కార్డియో, బ్యాటిల్ రోప్, మిలిటరీ ప్రెస్, మొబిలిటీ ట్రైనింగ్ వంటివి ఉంటాయి.

వెయిట్ ట్రైనింగ్

రకరకాల వెయిట్స్‌తో చేసే వర్కవుట్స్ అన్నీ వెయిట్ ట్రైనింగ్‌లో భాగంగా ఉంటాయి. బెంచ్ ప్రెస్, ఓవర్ హెడ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్, షోల్డర్ ప్రెస్, లెగ్ కర్ల్ వంటి పలురకాలు వ్యాయామాలు ఇందులో ఉంటాయి. జడేజా, కోహ్లీ, శార్దూ్ల్ ఠాకూర్, సూర్యకుమార్ యాదవ్ వంటి ప్లేయర్లు వెయిట్ ట్రైనింగ్ ఎక్కువగా చేస్తుంటారు.

రన్నింగ్, జంపింగ్

బౌలర్లు ఫిట్‌నెస్ కోసం రన్నింగ్‌, జంపింగ్ వంటివి ఎక్కువగా చేస్తుంటారు. రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జాస్ప్రిత్ బూమ్రా, మహమ్మద్ సిరాజ్ వంటి వాళ్లు రన్నింగ్‌, బాక్స్ జంపింగ్, హర్డిల్ జంప్స్, మెడిసినల్ బాల్ త్రో వంటి వ్యాయాలు చేస్తుంటారు. వీటివల్ల కార్డియో వాస్కులర్ స్ట్రెంత్ పెరుగడంతో పాటు ఎముకలు బలంగా తయారవుతాయి.

యోగా

ఫిట్‌నెస్ స్టైల్స్‌లో యోగా తీరు వేరు. యోగాతో ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. తద్వారా మైదానంలో పర్ఫామెన్స్‌ను ఇంప్రూవ్ అవుతుంది. యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల స్ట్రెస్ తగ్గి చురుగ్గా ఉండొచ్చు. శిఖర్ దావన్, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, సూర్యకుమార్ యాదవ్ వంటి వాళ్లు యోగా ప్రాక్టీస్ చేస్తుంటారు.

పిలాటీస్

కోర్ మజిల్ స్ట్రెంత్‌ను పెంచుకోవడానికి పిలాటీస్ వర్కవుట్స్ బాగా ఉపయోగపడతాయి. వీటితో పోశ్చర్ ఇంప్రూవ్ అవుతుంది. ఎండ్యూరెన్స్ పెరుగుతుంది. మన ప్లేయర్స్‌లో హార్దిక్ పాండ్యా పిలాటీస్ చేస్తుంటాడు.

First Published:  9 Nov 2023 10:25 AM GMT
Next Story