Telugu Global
Health & Life Style

సువాసన కోసం బాడీ స్ప్రే కంటే ఇవి బెస్ట్!

సువాసన రావడం కోసం చాలామంది బాడీ స్ప్రే లేదా పెర్‌ఫ్యూమ్‌ ఉపయోగిస్తుంటారు

సువాసన కోసం బాడీ స్ప్రే కంటే ఇవి బెస్ట్!
X

సువాసన రావడం కోసం చాలామంది బాడీ స్ప్రే లేదా పెర్‌ఫ్యూమ్‌ ఉపయోగిస్తుంటారు. అయితే దాని ప్రభావం కొంతసేపు మాత్రమే ఉంటుంది. రోజంతా సువాసన భరితంగా ఉండాలంటే ఇంకొన్ని చిట్కాలు ఫాలో అవ్వొచ్చు. అవేంటంటే..

ఒంటి నుంచి పరిమళాలు వస్తుంటే మనసుకి కూడా కాస్త ఉత్సాహంగా ఉంటుంది. దానికోసం ముందుగా ధరించే దుస్తులను సువాసనభరితంగా మార్చుకోవాలి. దానికోసం మార్కెట్లో రకరకాల ఫ్యాబ్రిక్ కండిషనర్లు దొరుకుతాయి. వాటిని వాడొచ్చు.

రకరకాల పనుల మీద బయటకి వెళ్లినప్పుడు ముఖం జిడ్డుగా అనిపిస్తే సబ్బుతో ఫేస్‌వాష్‌ చేసుకోవడం కంటే వెట్‌ వైప్స్‌తో తుడుచుకోవడం బెటర్. వైప్స్ వాడడం వల్ల జిడ్డు పోవడమే కాకుండా రీఫ్రెషింగ్ స్మెల్ వస్తుంది.

రోజంతా పరిమళభరితంగా ఉండాలనుకుంటే సెంటెడ్ నెయిల్‌ పాలిష్‌, సెంటెడ్ మాయిశ్చరైజర్ లాంటివి వాడాలి. అలాగే హెయిర్ స్ప్రే వాడడం వల్ల కూడా దుర్వాసన నుంచి బయటపడొచ్చు.

చెమట ఎక్కువగా పట్టేవాళ్లు కచ్చితంగా ఒంటికి సెంటెడ్ మాయిశ్చరైజర్ వాడాలి. స్నానం చేసిన తర్వాత చెమట ఎక్కువగా పట్టే ప్రాంతాల్లో సువాసన వచ్చే నేచురల్ మాయిశ్చరైజర్ రాయాలి.

సాక్సులు వేసుకునే వాళ్లు కాళ్ల నుంచి చెమట వాసన రాకూడందటే సాక్సు వేసుకునే ముందు పాదాలకు పరిమళాలు వెదజల్లే పౌడర్ రాసుకోవాలి. ఇలా చేస్తే చెమట వాసనకు చెక్‌ పెట్టొచ్చు.

ఒకసారి వేసుకున్న బట్టలు రెండోసారి వాడాలనుకుంటే వాటిని వార్డ్‌రోబ్‌లో పెట్టేటప్పుడు కలరా ఉండలు, లేదా సెంటెడ్ శాషెట్స్, వార్డ్ రోజ్ ఫ్రెషనర్స్ లాంటివి వాడాలి.

First Published:  20 Oct 2022 5:31 AM GMT
Next Story