Telugu Global
Health & Life Style

పిల్లల ఎముకలు బలంగా ఉండాలంటే పెట్టాల్సిన ఫుడ్స్‌ ఇవే..

చిన్నతనంలో పిల్లల ఎముకల ఆరోగ్యంపై దృష్టి పెట్టకపోతే.. మున్ముందు జీవితాంతం ప్రభావం చూపుతుంది. ఎముక సాంద్రత తగ్గిపోయి.. ఎముకలు క్షీణించటం, తేలికగా విరిగిపోవటం వంటి ముప్పులు పెరుగుతాయి.

పిల్లల ఎముకలు బలంగా ఉండాలంటే పెట్టాల్సిన ఫుడ్స్‌ ఇవే..
X

పెద్దలు ఆరోగ్యంగా ఉండటానికి ఏం తినాలి? ఏం తాగాలి అన్న విషయాలపై అవగాహన కలిగి ఉంటారు. దానికి తగ్గట్టే వారికి వారే శ్రద్ద తీసుకుంటారు. కానీ చిన్నపిల్లలకు అలా కాదు. వారికి మమ్ములుగా ఆహారం ఇవ్వడమంటేనే పెద్ద టాస్క్. పిల్లలు ఏదీ సరిగ్గా తినరు, తాగరు. ఒకవేళ ఏమైనా బలవంతంగా పెట్టాలని చూసినా సగం సగం తిని పారిపోతారు. అలా అని పిల్లలకు పోషకాహారం అందకపోతే వారి ఎదుగుదల మీద ప్రభావం పడుతుంది. మరీ ముఖ్యంగా పిల్లలకు సరిపడినంత కాల్షియం, ఐరన్ లభించకపోతే చాలా ఇబ్బందులు, పోషకాహార లోపం ఏర్పడతాయి. వీటిని అధిగమించడానికి పిల్లలకు తెలివిగా ఆహారం ఇవ్వాలి.

చిన్నతనంలో పిల్లల ఎముకల ఆరోగ్యంపై దృష్టి పెట్టకపోతే.. మున్ముందు జీవితాంతం ప్రభావం చూపుతుంది. ఎముక సాంద్రత తగ్గిపోయి.. ఎముకలు క్షీణించటం, తేలికగా విరిగిపోవటం వంటి ముప్పులు పెరుగుతాయి. చిన్నారుల ఎముకలు దృఢంగా ఉండటానికి, అభివృద్ధి చెందడానికి సమతుల్య ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఎదుగుతున్న పిల్లల ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలను పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..




పాలు..

పాలు, పాల ఉత్పత్తులలో కాల్షియం, ఫాస్పరస్‌ సమృద్ధిగా ఉంటాయి. ఎముకలు, దంతాలు, గోళ్ల అభివృద్ధికి ఈ పోషకాలు కీలకపాత్ర పోషిస్తాయి. అంతేకాదు పాలలో ప్రొటీన్‌, జింక్‌, విటమిన్‌ A, B2, B12 వంటి పోషకాలు ఉంటాయి. పిల్లలకు రోజూ పాలు ఇస్తే ఎముకల బలంగా ఉండటమే కాదు.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది.

పెరుగు..

పెరుగులో కాల్షియం, విటమిన్‌ డి వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. పెరుగులో కాల్షియం, భాస్వరం, ప్రోటీన్, లాక్టోస్ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం వల్ల ఎముకలు, దంతాలు గట్టిపడతాయి.

ఆకుపచ్చ కూరగాయలు..

పాలకూర పోషకాల ఒక పవర్‌ హౌస్‌. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, విటమిన్‌-ఏ,సి, కె. వంటివి మెండుగా ఉంటాయి. అలాగే మెంతికూర, బ్రొకోలీ, ముల్లంగి ఆకులు వంటి ఆకుపచ్చ కూరగాయల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. పుదీనా, కొత్తిమీర కూడా ఎముకల అభివృద్ధికి, బలంగా ఉండటానికి తోడ్పడతుంది.

నట్స్, బీన్స్‌..

డ్రై ఫ్రూట్స్,‌ నట్స్‌లో కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి, దృఢంగా ఉండటానికి తోడ్పడతాయి. మీ పిల్లల డైట్‌లో నట్స్‌ యాడ్‌ చేస్తే.. వారి ఎముకలు బలంగా ఉంటాయి. వాల్ నట్స్, అంజీర, ఖర్జూరం, నేరేడు పండ్లు వంటి గింజలు కాల్షియానికి గొప్ప వనరులు. వీటిలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే బ్లాక్ బీన్స్, పింటో బీన్స్, కిడ్నీ బీన్స్‌లో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకల నిర్మాణానికి, అభివృద్ధికి తోడ్పడతాయి.




First Published:  6 Jan 2024 11:32 AM GMT
Next Story