Telugu Global
Health & Life Style

ఆ జ్యూస్‌ తో గుండె ఆరోగ్యం మెరుగు

టమోటో జ్యూస్‌ లో బోలెడు ఆరోగ్య కారకాలు

ఆ జ్యూస్‌ తో గుండె ఆరోగ్యం మెరుగు
X

తెలుగింటి ప్రతి వంటకంలో తప్పనిసరిగా ఉండేది టమోటో. ఈ ఎర్రటి పండు ఆరోగ్యానికి మస్తు మంచి చేస్తుందట. అవును.. గుండె ఆరోగ్యాన్ని టమోటో జ్యూస్‌ ఎంతో మెరుగు పరుస్తుందని నిపుణులు చెప్తున్నారు. టమోటో జ్యూస్‌ లో 95 శాతం నీరే ఉంటుంది.. దీనితో పాటు విటమిన్‌ బీ6, విటమిన్‌ సీ కూడా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం లాంటి మైక్రో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. టమోటోను కూరలో భాగంగా కాకుండా జ్యూస్‌ చేసుకొని తాగితే ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందని హెల్త్‌ ఎక్స్‌ పర్ట్‌ లు చెప్తున్నారు. టమోటో జ్యూస్‌ రోజూ తాగితే 30 రోజుల్లోనే ఎన్నో మార్పులు వస్తాయని స్పష్టం చేస్తున్నారు. రక్తంలో బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ ను తగ్గించడానికి ఈ జ్యూస్‌ ఉపయోగపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది, టెన్షన్‌ ను తగ్గిస్తుందని కూడా చెప్తున్నారు. క్యాన్సర్‌ నివారణకు, బరువు తగ్గడానికి ఇది ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరిచి కడుపులో ఎసిడిటీని తగ్గించడానికి తోడ్పాటు అందిస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న టమోటో జ్యూస్‌ ను ప్రతి ఒక్కరు తాగాలని ఎక్స్‌ పర్ట్‌లు సూచిస్తున్నారు. నేరుగా టమోటోలను గ్రైండ్‌ చేసి జ్యూస్‌ చేసుకోవచ్చని.. టేస్ట్‌ కోసం అల్లం, ఉప్పు, నిమ్మరసం కూడా యాడ్‌ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం టమోటో జ్యూస్‌ చేసుకొని ఆస్వాదించండి.. ఆరోగ్యంగా ఉండండి అని నిపుణులు చెప్తున్నారు.

First Published:  24 Sept 2024 1:46 PM GMT
Next Story