Telugu Global
Health & Life Style

మండే ఎండల్లో ఇవి తినకండి

ఈ సీజన్లో కొన్ని ఆహారాలను అస్సలు తినకూడదు. ఇంకొన్నింటిని తక్కువగా తినాలి.. సో అలాంటి పదార్ధాలు ఏవో తెలుసుకుందాం.

మండే ఎండల్లో ఇవి తినకండి
X

తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ సీజన్లో మనం ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే సమస్యలు వెంటాడుతాయి. వడదెబ్బ కొట్టి ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంది. ఈ సీజన్లో కొన్ని ఆహారాలను అస్సలు తినకూడదు. ఇంకొన్నింటిని తక్కువగా తినాలి.. సో అలాంటి పదార్ధాలు ఏవో తెలుసుకుందాం.

వేసవిలో బాగా దూరం పెట్టాల్సిన ఆకుకూర పాలకూర. ఇందులో జింక్, సెలీనియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి .. కానీ ఇది వేడిని పెంచే ఆకుకూర. అందుకే చలికాలంలో తింటారు. వేసవి కాలంలో దీన్ని ఎక్కువ మోతాదులో తినకూడదు. అలాగే వేరుశెనగ కూడా. ఇందులోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కానీ దీని కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వేసవిలో వేరుశెనగను ఎక్కువగా తినకండి.

వేసవి కాలం అంటే టక్కున గుర్తు వచ్చేది మామిడి పండు. అయితే మామిడిపండ్లు మన శరీరంలో వేడిని పెంచుతాయి. కాబట్టి చాలా ఎక్కువ మామిడి పండ్లను తినడం వల్ల చాలా వేడి పెరుగుతుది. తిన్న తర్వాత జీర్ణం కావడానికి సమయం తీసుకోవడానికి ఇదే కారణం. దీని కారణంగా, శరీరం యొక్క ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది, దీని కారణంగా శరీరంమీద వేడి కూరుపులు వస్తాయి. అందుకే వీటిని కాస్త తక్కువగా తినడం మంచిది.

గుడ్లలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. కానీ అదే సమయంలో శరీరంలో వేడిని కూడా ఉత్పత్తి చేస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే అల్లం శరీరంలో వేడిని కూడా పెంచుతుంది. కాబట్టి వేసవిలో వీటిని ఎక్కువగా తినకండి.

కొబ్బరి నీరు మన శరీరానికి మేలు చేస్తుంది, కానీ పచ్చి కొబ్బరి శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. బాదం లేదా ఇతర డ్రై ఫ్రూట్స్ , క్యారెట్ కూడా వేడి స్వభావం కలిగి ఉంటాయి. అందుకే వేసవిలో వీటిని ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది.

వీటితి పాటూ స్ట్రీట్ ఫుడ్ ని దూరం పెట్టండి. చాలా స్టాల్స్‌లో వేసవి కాలంలో కూడా రిఫ్రిజిరేటర్‌లు ఉండవు. దీనివల్ల, విపరీతమైన వేడి కారణంగా ఆహారం సులభంగా, తొందరగా పాడైపోతుంది. అలాగే ఈ ఫుడ్ లో వాడే నూనెల వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. సో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ వేసవిని అనారోగ్యం లేకుండా ఆనందంగా సాగనంపవచ్చు.

First Published:  3 April 2024 6:57 AM GMT
Next Story