Telugu Global
Health & Life Style

ఇలా చేస్తే డయాబెటిస్ తగ్గుతుంది! స్టడీలో కొత్త విషయాలు!

భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఇటీవల చేసిన ఓ స్టడీలో మధుమేహానికి సంబంధించిన ఎన్నో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. ఈ స్టడీలో మనదేశంలో డయాబెటిస్ సమస్య ఎక్కువగా ఉండడానికి కారణాలు, డయాబెటిస్ తగ్గించుకోడానికి ఉన్న మార్గాలను రీసెర్చర్లు తెలుసుకున్నారు.

Sugar Control Tips in Telugu
X

భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఇటీవల చేసిన ఓ స్టడీలో మధుమేహానికి సంబంధించిన ఎన్నో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. ఈ స్టడీలో మనదేశంలో డయాబెటిస్ సమస్య ఎక్కువగా ఉండడానికి కారణాలు, డయాబెటిస్ తగ్గించుకోడానికి ఉన్న మార్గాలను రీసెర్చర్లు తెలుసుకున్నారు.

ఐసీఎంఆర్‌ చెప్తున్న దాని ప్రకారం భారతీయులు సగటున రోజుకు 2500 క్యాలరీల ఆహారం తీసుకుంటున్నారట. అందులో 65- నుంచి 80 శాతం పిండి పదార్థాలు(కార్బోహైడ్రేట్స్‌) ఉంటున్నాయి. ప్రొటీన్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో ప్రొటీన్‌ 20 శాతం ఉండేలా చూసుకుంటే డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుందట. అలాగే షుగర్ వస్తే జీవితాంతం మందులు వాడితే తప్ప కంట్రోల్‌లో ఉండదని అందరూ అనుకుంటుంటారు. కానీ ఐసీఎంఆర్ తాజా అధ్యయనం ప్రకారం మనం రోజువారి ఆహారంలో 20 శాతం ప్రొటీన్స్ చేర్చుకుంటే మందుల అవసరం లేకుండా మధుమేహాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చని వెల్లడైంది. దీంతోపాటు కొత్తగా మధుమేహం బారిన పడినవారి కోసం ఐసీఎంఆర్‌ ఒక డైట్ ప్లాన్‌ను సూచించింది.

ఐసీఎంఆర్ సుమారు 18 వేల మంది ఆహారపు అలవాట్లను పరిశీలించి, వాళ్లు చెప్పిన వివరాల ప్రకారం.. ఒక డైట్ ప్లాన్ ప్రిపేర్ చేసింది. కొత్తగా డయాబెటిస్‌ బారిన పడినవారు తాము తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు 49 నుంచి 54 శాతం, ప్రొటీన్స్ 20 శాతం, కొవ్వులు 20 శాతం ఉండేలా చూసుకోవాలి. ప్రీడయాబెటిక్‌ స్టేజ్‌లో ఉన్నవాళ్లు తమ ఆహారంలో కార్బోహైడ్రేట్స్‌ను 50 శాతానికి తగ్గించుకోవాలి. అలాగే.. షుగర్ లెవల్స్ నార్మల్‌గా ఉన్నవాళ్లు ఆహారంలో కార్బోహైడ్రేట్స్ 60 శాతం వరకూ తీసుకోవచ్చు. మొత్తంగా రోజువారీ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ను తగ్గించి, ఆ మేరకు ప్రొటీన్స్, కొవ్వు పదార్థాలను పెంచుకుంటే డయాబెటిస్‌ ముదరకుండా ఉంటుందని ఐసీఎంఆర్ చెప్తోంది. అలాగే అసలు డయాబెటిస్ బారిన పడకుండా ఉండాలంటే.. తక్కువ తినడాన్ని అలవాటు చేసుకోవాలి. సమయానికి తినాలి. నెమ్మదిగా తినాలి. పోషకాహారానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. రోజూ వ్యాయామం చేస్తూ, తగినంత నిద్ర పోవాలి. ఒత్తిడి లేని లైఫ్‌స్టైల్ అలవాటు చేసుకోవాలి.

First Published:  22 Sep 2022 8:15 AM GMT
Next Story