Telugu Global
Health & Life Style

మెదడు ఆరోగ్యం కోసం ఆరు చిట్కాలు

రోజువారీ జీవితంలో తెలియకుండా చేసే కొన్ని పనులు, అలవాట్లు మెదడు పనితీరుని దెబ్బతీస్తాయి. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి. ఒత్తిడి, ఆందోళనలు ఎక్కువవుతాయి.

మెదడు ఆరోగ్యం కోసం ఆరు చిట్కాలు
X

శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే ముందు మెదడు ఆరోగ్యంగా ఉండాలి. అయితే రోజువారీ జీవితంలో తెలియకుండా చేసే కొన్ని పనులు, అలవాట్లు మెదడు పనితీరుని దెబ్బతీస్తాయి. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి. ఒత్తిడి, ఆందోళనలు ఎక్కువవుతాయి. ఈ ఆరు నియమాలను పాటించడం ద్వారా మెదడుని ఎప్పుడూ హెల్దీగా ఉంచుకోవచ్చు.

మెదడు పనితీరు సరిగ్గా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యం. వ్యాయామం మెదడును ఉత్తేజపరుస్తుంది, మెదడు సామర్థ్యాన్ని పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది.

మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలంటే మెదడుకు ఆక్సిజన్ అందేలా చూడాలి. దానికోసం స్మోకింగ్ మానేయాలి. పండ్లు, కూరగాయలు, నట్స్, చేపలు లాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.

మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే రక్తపోటు, డయాబెటిస్, కొలెస్ట్రాల్ లాంటివి అదుపులో ఉండాలి. ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. అలాగే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా కూడా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

రోజూ తగినంత నిద్ర పోవడం ద్వారా మెదడుకు ప్రశాంతత చేకూరుతుంది. నిద్ర మెదడుని రిలాక్స్ చేస్తుంది. మరుసటి రోజుకు శక్తినిస్తుంది. అలాగే ధ్యానం, యోగా తో కూడా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

ఇక వీటితో పాటు మెదడు షార్ప్‌గా పనిచేయాలంటే దానికి కొంత పదును పెట్టాల్సి ఉంటుంది. దానికోసం పజిల్ సాల్వింగ్, ప్రాబ్లెమ్ సాల్వింగ్ లాంటి యాక్టివిటీస్ చేస్తుండాలి.

మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ జీవితంలో ఎలాంటి గొడవలు లేకుండా చూసుకోవాలి. ఇతరులతో స్నేహంగా ఉండడాన్ని అలవాటు చేసుకోవాలి. చుట్టూ ఆరోగ్య కరమైన వాతావరణం ఉండడం వల్ల మెదడు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటుంది.

First Published:  17 Sep 2022 12:49 PM GMT
Next Story