Telugu Global
Health & Life Style

బ్లడ్ సర్కులేషన్ కోసం సింపుల్ వర్కవుట్స్!

శరీరంలో చర్మం నుంచి గుండె దాకా ప్రతి అవయవం హెల్దీగా ఉండాలంటే వాటికి సరైన స్థాయిలో రక్తం అందాలి.

బ్లడ్ సర్కులేషన్ కోసం సింపుల్ వర్కవుట్స్!
X

శరీరంలో చర్మం నుంచి గుండె దాకా ప్రతి అవయవం హెల్దీగా ఉండాలంటే వాటికి సరైన స్థాయిలో రక్తం అందాలి. శరీరంలో రక్త ప్రసరణ ఒక్కటి సరిగ్గా ఉంటే చాలు.. చిన్న చిన్న సమస్యలన్నీ ఆటోమెటిక్‌గా వాటంతట అవే సాల్వ్ అవుతాయి. రక్తప్రసరణ సరిగ్గా ఉండేందుకు ఎలాంటి వర్కవుట్స్ చేయాలో చూద్దాం.

శరీరంలో రక్తప్రసరణ సరిగా లేకపోతే లేకపోతే తిమ్మిర్లు పట్టడం, జుట్టు రాలడం, కీళ్ల నొప్పులు లాంటి సమస్యలు వస్తాయి. కొన్ని చిన్నచిన్న ఎక్సర్‌‌సైజుల ద్వారా శరీరాన్ని ఉత్తేజపరచి రక్త ప్రసరణ సరిగా అయ్యేట్టు చేయొచ్చు.

కోబ్రా పోజ్

నేలపై బోర్లా పడుకొని, చేతులను చెస్ట్‌కు ఇరువైపులా ఆనించి.. చేతులను నేలకు అదిమిపెట్టి శ్వాస తీసుకుంటూ మెల్లగా అప్పర్ బాడీని పైకి లేపాలి. ఈ పొజిషన్‌లో ఉండగలిగినంత సేపు ఉండాలి. దీన్నే భుజంగాసనం అని కూడా అంటారు.

ప్లాంక్

ప్లాంక్ అందరికి తెలిసిన వ్యాయామమే. రక్త ప్రసరణ మెరుగవడానికి ప్లాంక్ బాగా పనిచేస్తుంది. నేలపై బోర్లా పడుకుని చేతులపై పైకి లేవాలి. ఆ విధంగా ప్లాంక్ పొజిషన్‌లో ఉండి తర్వాత రిలాక్స్ అవ్వాలి. ఇలా ముప్ఫై సెకన్లపాటు చేస్తే చాలు.

బ్రిడ్జి పోజ్

బ్రిడ్జి పోజ్ కోసం ముందు నేలపై వెల్లకిలా పడుకోవాలి. తర్వాత మోకాళ్ళను వంచి, చేతులను శరీరానికి ఇరువైపులా ఉంచాలి. తర్వాత పాదాలు నేలకు సమాంతరంగా ఉంచి, మెల్లగా నడుమును పైకి ఎత్తాలి. ఇలా ముప్పై సెకన్ల నుంచి ఒక నిముషం వరకు అదే పోజ్‌లో ఉండాలి.

జాగ్రత్తలు

రక్త ప్రసరణ మెరుగుపడాలంటే... తీసుకునే ఆహారంలో ఐరన్ ఉండేలా చూసుకోవాలి. శరీరంలో సరైన పోషకాలు లేకపోతే...రక్తకణాల ఉత్పత్తి తగ్గి, రక్త శాతంతో పాటు రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది.

రక్త ప్రసరణ కోసం ఐరన్‌తో పాటు ఇతర విటమిన్లు, మినరల్స్‌ వంటివి శరీరానికి అందేలా చూసుకోవాలి. పప్పు్లు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పండ్లు... వంటివి తీసుకోవాలి. వీటివల్ల శరీరానికి సమతులంగా పోషకాలు అందుతాయి.

- ఈ రోజుల్లో చాలామందికి కూర్చొని చేసే ఉద్యోగాలే ఎక్కువ. అలాంటి వాళ్లకు రక్తప్రసరణ సరిగా ఉండాలంటే... రోజులో ఎంతో కొంత వ్యాయామం తప్పనిసరి. శరీరంలో కదలికలు ఉంటేనే రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది. రోజుకు కనీసం ఇరవై నిమిషాల పాటు ఏదో ఒక వ్యాయామం చెయ్యడం అవసరం.

- పల్లీలు, గుమ్మడి, పుచ్చపండు గింజలు, సబ్జాగింజలు, అవిసెగింజలు వంటివి రక్తప్రసరణ మెరుగు పరచడానికి ఉపయోగపడతాయి. వంటల్లో ఉల్లి, వెల్లుల్లి, అల్లం కూడా తరచుగా వాడుతుండాలి. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

First Published:  12 Dec 2023 6:12 AM GMT
Next Story