Telugu Global
Health & Life Style

సెల్ప్‌చెక్‌తో ప్లాబ్లమ్స్‌కు చెక్

సంతోషంగా ఉండలేని చాలామంది దానికి కారణం పక్కవాళ్లేనంటూ వాళ్లని నిందిస్తుంటారు. ఇతరులలో తప్పులను వెతుకుతూ.. ఆ తప్పుల వల్లే ఇబ్బంది పడుతున్నాం అనుకుంటారు.

సెల్ప్‌చెక్‌తో ప్లాబ్లమ్స్‌కు చెక్
X

సంతోషంగా ఉండలేని చాలామంది దానికి కారణం పక్కవాళ్లేనంటూ వాళ్లని నిందిస్తుంటారు. ఇతరులలో తప్పులను వెతుకుతూ.. ఆ తప్పుల వల్లే ఇబ్బంది పడుతున్నాం అనుకుంటారు. కానీ సంతోషంగా ఉండడం అనేది పూర్తిగా మనమీదే ఆధారపడి ఉంటుంది. ఇతరులలో తప్పులు వెతికే ముందు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. హ్యాపీ లైఫ్ కోసం సెల్ఫ్ చెక్ చేసుకోవడం ఎంత ముఖ్యమంటే.

ప్రతి రోజు.. ఆ రోజు జరిగిన విషయాలను గురించి ఒక్కసారి రాత్రి పడుకునే ముందు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ‘ఈ రోజంతా నేను ఎలా ప్రవర్తించాను, దాని వల్ల జరిగిన తప్పొప్పులేంటి?’ అనే విషయాలు పరిశీలించుకోగలగాలి. దీనినే సెల్ప్ చెక్ లేదా ఆత్మ పరిశీలన అంటారు. ఈ సెల్ఫ్ చెక్ వల్ల మనకు మన గురించి పూర్తిగా తెలుస్తుంది. మన ఆలోచనలను సరిచేసుకునే వీలుంటుంది.

సెల్ప్ చెక్ ద్వారా సమస్యలకు మూల కారణం కనుక్కోవచ్చు. అంటే మనల్ని ఇబ్బంది పెట్టిన సంఘటనలు జరిగినప్పుడు దాని గురించిన కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ‘అది ఎందుకు జరిగింది? ఎలాంటి పరిస్థితులలో జరిగింది? అందులో ఎవరి బాధ్యత ఎంత ఉంది?’ అనేవి చెక్ చేసుకోవాలి. ఇలాంటి ప్రశ్నలను ప్రశాంతమైన మనస్సుతో ఆలోచిస్తే అన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి. అప్పుడు తప్పు ఎక్కడ జరిగిందో క్లియర్‌‌గా అర్థమవుతుంది. మన మిస్టేక్ ఏదైనా ఉంటే దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.

మనకు ఆలోచనలతో పాటు ఎమోషన్స్ కూడా కామన్‌గా వస్తూ ఉంటాయి. అయితే ఎమోషనల్‌గా ఫీలయ్యేటప్పుడు ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. అందుకే బావోద్వేగాలకు సంబంధించి ప్రతిరోజూ కాసేపు సెల్ప్ చెక్ చేసుకోవడం అవసరం. ‘ఎలాంటి పరిస్థితులకు ఎమోషనల్ అవుతున్నాం’ అనే విషయాలు సెల్ప్ చెక్ చేసుకోవడం ద్వారా చాలావరకూ ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవచ్చు. ఉదాహరణకి కొంతమంది ఎదుటి వారి వలన ఎంత నష్టం జరిగినా ముఖం మీద చిరునవ్వుతో ఉంటారు. మరికొంతమంది మాత్రం కోపంతో తిట్టేస్తుంటారు. ఇలా జరగకూడదంటే ఎవరికి వారు ఎమోషన్స్ గురించి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి.

లాభాలివి

సెల్ప్ చెక్ అనేది ఆలోచనలు సరిద్దికోవటానికి ఉపయోగపడుతుంది. రిలేషన్స్‌ను మెరుగుపరుస్తుంది.

సెల్ప్ చెక్ ద్వారా ఎమోషన్స్‌ను కనిపెట్టగలిగితే.. వాటిని తగ్గించుకోవటానికి ధ్యానం, యోగా లాంటివి ప్రాక్టీస్ చేయొచ్చు. దాని వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

సెల్ప్ చెక్ వల్ల చాలా సమస్యలను పరిష్కారాలు దొరుకుతాయి. మనలో తెలియని ప్రశాంతత వస్తుంది.

సెల్ప్ చెక్ వల్ల క్రియేటివిటీ, తెలివి పెరుగుతాయి. అన్‌కాన్షియస్‌గా బిహేవ్ చేయడం తగ్గుతుంది.

First Published:  13 Nov 2023 7:41 AM GMT
Next Story