Telugu Global
Health & Life Style

ఊరికే అలసిపోతున్నారా? ఈ కారణాల వల్ల కావొచ్చు!

తరచూ అలసటకు గురవుతుంటే దానికి నిద్రలేమి ప్రధాన సమస్యగా ఉండి ఉండొచ్చు.

ఊరికే అలసిపోతున్నారా? ఈ కారణాల వల్ల కావొచ్చు!
X

రోజువారీ జీవితంలో అలసట అనేది చాలా సాధారణంగా కనిపిస్తుంటుంది. అయితే ఏదైనా పనిచేసినప్పుడు ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ఇలా అలసటగా అనిపించడం కామన్. అలా కాకుండా రోజులో తరచుగా అలసటకు లోనవుతుంటే దానికి ఇతర అనారోగ్య కారణాలు ఉండి ఉండొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తరచూ అలసటకు గురవుతుంటే దానికి నిద్రలేమి ప్రధాన సమస్యగా ఉండి ఉండొచ్చు. రోజులో తగినంత విశ్రాంతి తీసుకోకపోతే ఫలితంగా అలసట వేధిస్తూ ఉంటుంది. కాబట్టి అలసటగా ఫీలవుతున్నవాళ్లు రోజుకి ఎన్ని గంటలు పడుకుంటున్నారో చెక్ చేసుకోవాలి. కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.

పోషకాహార లోపం కూడా అలసటకు దారి తీస్తుంది. ముఖ్యంగా ఐరన్ లోపం, బీ 12 డెఫీషియన్సీ, విటమిన్–డి సరిపడా లేకపోవడం వల్ల కూడా తరచూ అలసట అనిపిస్తుంది. కాబట్టి తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఉండేలా డైట్ సరిచూసుకోవాలి.

మానసికంగా ఆరోగ్యంగా లేకపోతే కూడా అలసిపోయినట్టు అనిపిస్తుంది. రోజువారీ జీవితంలో ఒత్తిడి, డిప్రెషన్ వంటివి ఉంటే తరచూ అలసటగా అనిపిస్తుంది. కాబట్టి ఒత్తిడితో కూడిన లైఫ్‌స్టైల్ ఉన్నవాళ్లు వెంటనే దానికి గల కారణాలను తెలుసుకుని ఒత్తిడి నుంచి బయటపడాలి.

ఇకపోతే రొటేషనల్ షిఫ్ట్స్‌లో పనిచేసేవాళ్లు, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉన్నవాళ్లకు కూడా తరచూ అలసటగా అనిపించే అవకాశం ఉంది. అలాగే రోజుకి తగినంత నీళ్లు తాగకపోయినా అలసటగా అనిపిస్తుంది. కాబట్టి అలసటగా అనిపిస్తున్నవాళ్లు రోజులో నాలుగు లీటర్ల నీళ్లు తాగుతున్నారో లేదో చెక్ చేసుకోవాలి.

అలసటగా అనిపిస్తున్నప్పుడు 20 నిముషాల పాటు ఒక పవర్ న్యాప్ వేయడం లేదా స్నానం చేయడం ద్వారా ఇన్ స్టంట్ ఎనర్జీ లభిస్తుంది. అలాగే థైరాయిడ్, అనీమియా వంటి సమస్యలు ఉన్నవాళ్లు, రకరకాల మెడిసిన్స్ ప్రభావం వల్ల కూడా అలసటగాఅనిపించొచ్చు. కాబట్టి ఎంతకీ అలసట తగ్గకపోతుంటే డాక్టర్ ను కలిసి తగిన సలహా తీసుకోవడం మంచిది.

First Published:  29 Feb 2024 6:45 AM GMT
Next Story