Telugu Global
Health & Life Style

ఆహారంపై శ్ర‌ద్ధ పెట్టండి ఆరోగ్యం, అందం దానికదే వస్తుంది

మీకు స్పష్టమైన, మెరిసే చర్మం, దృఢమైన జుట్టు, బలమైన, అందమైన గోర్లు కావాలంటే.. తీసుకునే ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధపెట్టాలి.

ఆహారంపై శ్ర‌ద్ధ పెట్టండి ఆరోగ్యం, అందం దానికదే వస్తుంది
X

చాలా మంది పైపైన మెరుగులతో, ఫేస్‌ ప్యాక్స్‌తో, బ్యూటీ క్రీమ్స్‌తో అందంగా మెరిసిపోవచ్చు అనే అపోహలో ఉంటారు. అయితే, మన అందం శరీరం లోపలి నుంచి మొదలవుతుందనే.. నిజాన్ని మరచిపోతున్నారు. మన పేలవమైన ఆహార అలవాట్లు.. చర్మంపైనే కనిపిస్తూ ఉంటాయి. మీకు స్పష్టమైన, మెరిసే చర్మం, దృఢమైన జుట్టు, బలమైన, అందమైన గోర్లు కావాలంటే.. తీసుకునే ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధపెట్టాలి.

మీటిలో మొదటిది చర్మం ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఉపయోగపడే సాల్మన్‌, మాకేరేల్‌, హెర్రింగ్‌ వంటి చేపలు. ఫ్యాటీ ఫిష్‌లో చర్మ ఆరోగ్యాన్ని రక్షించే.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి.ఇవి ఆరోగ్యకరమైన, మృదువైన చర్మాన్ని నిర్వహించడానికి చాలా అవసరం.


గుడ్లు చర్మానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. వీటిలో ప్రొటీన్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మం మరమ్మత్తు, పునరుత్పత్తికి అవసరం. వీటిలో విటమిన్‌ A, E ఆరోగ్యకరమైన చర్మ కణాలను నిర్వహించడానికి సహాయపడతాయి.

టమాటాలలో లైకోపీన్‌తో ప్రధాన కెరోటినాయిడ్లు, విటమిన్ సీ వంటి ఫోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీటా కెరోటిన్, లుటిన్, లైకోపీన్ మీ చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షిస్తాయి. ఈ పోషకాలు ముడతలను కూడా నివారిస్తాయి.

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీల్లో విటమిన్‌ సితో సహా.. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు నిండి ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌ వల్ల కలిగే నష్టం నుంచి చర్మ కణాలను రక్షిస్తాయి. బెర్రీలలోని పోషకాలు వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా రక్షిస్తాయి.



చర్మ ఆరోగ్యానికి వాల్‌నట్స్‌ ఎంతో మేలు చేస్తాయి. వాల్‌నట్స్‌లో ఫ్యాటీ యాసిడ్స్‌ మెండుగా ఉంటాయి. ఇతర నట్స్‌తో పోలిస్తే వాల్‌నట్స్‌లో ఒమేగా -3, ఒమేగా -6 దీనిలో అధికంగా ఉంటుంది. ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లను అధికంగా తీసుకోవడం వల్ల సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులతో, శరీరంలో మంటను తగ్గిస్తుంది.

అలాగే అవోకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇక బ్రకోలీలో విటమిన్‌ ఏ, జింక్‌, విటమిన్‌ సి పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్ని చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

First Published:  28 Feb 2024 9:00 AM GMT
Next Story