Telugu Global
Health & Life Style

సమ్మర్‌‌లో కర్బూజ ఎందుకు తినాలంటే..

సమ్మర్‌‌లో సీజనల్‌గా దొరికే ఫ్రూట్స్‌లో కర్భూజా ఒకటి. సమ్మర్‌‌లో కర్బూజా తినడం ద్వారా బోలెడు బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు డాక్టర్లు.

సమ్మర్‌‌లో కర్బూజ ఎందుకు తినాలంటే..
X

సమ్మర్‌‌లో సీజనల్‌గా దొరికే ఫ్రూట్స్‌లో కర్భూజా ఒకటి. సమ్మర్‌‌లో కర్బూజా తినడం ద్వారా బోలెడు బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు డాక్టర్లు. అవేంటంటే..

సమ్మర్ వచ్చిందంటే పుచ్చకాయలతో పాటు కర్బూజా పండ్లు కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. జ్యూస్ షాపుల్లో కూడా కర్బూజా దర్శనమిస్తుంది. అయితే సమ్మర్‌‌లో రోజుకి ఒక గ్లాస్ కర్బూజా జ్యూస్ తాగినా లేదా పండు తిన్నా పూర్తి ఆరోగ్యంగా ఉండొచ్చు.

కర్బూజా పండులో బీటాకెరోటిన్లు, ‘సి’ విటమిన్ ఎక్కువ పాళ్లలో ఉంటాయి. ఇవి సమ్మర్‌‌లో ఇమ్యూనిటీని పెంచడానికి హెల్ప్ చేస్తాయి.

కర్బూజ పండులో నీటిశాతం ఎక్కువ. కాబట్టి దీన్ని తినడం ద్వారా హైడ్రేటెడ్‌గా ఉండొచ్చు. అంతేకాదు, ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్‌కు కిడ్నీలో రాళ్లను కరిగించే లక్షణం కూడా ఉంది. కాబట్టి ఈ సీజన్‌లో వేడి చేయకుండా, యూరిన్ సమస్యలు రాకుండా కర్బూజా కాపాడుతుంది.

కర్బూజా పండులో ఉండే విటమిన్లు, మినరల్స్.. తెల్ల రక్త కణాలను వృద్ధి చేస్తాయి. తద్వారా సమ్మర్‌‌లో ఇన్ఫెక్షన్స్‌తో పోరాడే శక్తి పెరుగుతుంది. అంతేకాదు మస్క్ మిలన్‌లో ఉండే పోషకాలు క్యాన్సర్ కణాలతో పోరాడి వాటిని నశింపజేస్తాయి.

బరువు తగ్గాలనుకునేవాళ్లకు కూడా ఇది బెస్ట్ ఫ్రూట్. ఇందులో ఫ్యాట్ కంటెంట్ ఉండదు. కేవలం నీరు, మినరల్స్, విటమిన్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి డైట్‌లో చేర్చుకోవడానికి ఇది బెస్ట్ చాయిస్. అలాగే కర్భూజా విత్తనాల్లో కూడా పొటాషియం మినరల్ ఉంటుంది. ఇది కొవ్వుని కరిగించడంలో సాయపడుతుంది.

కర్బూజ పండులో విటమిన్ ‘కె’, విటమిన్ ‘ఇ’ కూడా ఎక్కువ శాతంలో ఉంటాయి. ఇవి ఫెర్టిలిటీ సమస్యలను తగ్గిస్తాయి. అలాగే ఇవి గర్భిణులకు వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తాయి.

ఇకపోతే కర్బూజ పండులో ఉండే విటమిన్ ‘ఎ’ కంటి ఆరోగ్యానికి మంచిది. అలాగే కర్బూజ పండ్లు తినడం వల్ల మెదడుకి ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. తద్వారా ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది.

First Published:  12 March 2024 8:26 AM GMT
Next Story