విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి మంకీ పాక్స్
కేరళకు చెందో రెండో వ్యక్తికి వైరస్ సోకినట్టుగా నిర్దారణ
BY Naveen Kamera23 Sept 2024 1:59 PM GMT
X
Naveen Kamera Updated On: 23 Sept 2024 1:59 PM GMT
విదేశాల నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన ఇద్దరికి మంకీ పాక్స్ నిర్దారణ అయ్యింది. వారికి క్లాడ్ 1బీ వైరస్ సోకినట్టుగా వైద్య పరీక్షల్లో నిర్ణరణ అయ్యింది. కేరళకు చెందిన రెండో వ్యక్తికి మంకీపాక్స్ నిర్దారణ కాగా, దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఒకరికి వైరస్ సోకినట్టుగా గుర్తించారు. దుబయి నుంచి ఇండియాకు వచ్చిన కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తికి మంకీపాక్స్ నిర్ణారణ అయ్యిందని సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. విదేశాల నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉండటంతో ఐసోలేట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించామని, ఆయనకు వ్యాధి నిర్దారణ అయ్యిందని హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, విదేశాలకు వెళ్లివచ్చినవాళ్లు అనారోగ్యంతో ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.
Next Story