Telugu Global
Health & Life Style

వంటింట్లో మైక్రో ప్లాస్టిక్! జాగ్రత్తలు ఇలా..

ప్రస్తుతం మార్కెట్‌లో కల్తీ పదార్థాల హవా ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణ వస్తువుల నుంచి వంటింటి సరుకుల వరకూ అన్నింటిలో కల్తీ ఉంటోంది. వీటివల్ల ప్రజల సొమ్ము వృథా కావడమే కాకుండా ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయి.

వంటింట్లో మైక్రో ప్లాస్టిక్! జాగ్రత్తలు ఇలా..
X

ప్రస్తుతం మార్కెట్‌లో కల్తీ పదార్థాల హవా ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణ వస్తువుల నుంచి వంటింటి సరుకుల వరకూ అన్నింటిలో కల్తీ ఉంటోంది. వీటివల్ల ప్రజల సొమ్ము వృథా కావడమే కాకుండా ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయి. వీటికై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

వంటింట్లో వాడే బియ్యం, పప్పులు, మసాలా దినుసులు, నూనెలు, చక్కెరలు.. ఇలా చాలా పదార్థాలు చాలారకాలుగా కల్తీ అవుతుంటాయి. అయితే ఇటీవల చేసిన కొన్ని స్టడీల్లో వంటిట్లో వాడే ఉప్పు, చక్కెరలో మైక్రో ప్లాస్టిక్ కలుస్తోందని తెలిసింది. వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

వంటింట్లో వాడే ఉప్పు, పంచదారతోపాటు పలు స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్, ఇంటి అవసరాలకు వాడే క్లీనింగ్, డిటర్జెంట్ ప్రొడక్ట్స్‌లో మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు కనిపిస్తున్నాయని రీసెంట్ స్టడీల్లో వెల్లడైంది. దేశంలో అమ్ముడవుతున్న టాప్ బ్రాండ్ ఉప్పు, చక్కెరల్లో కూడా ఇవి ఉన్నాయట. అసలు ప్రొడక్షన్ లెవల్లోనే ఈ కల్తీ జరుగుతోందట. అందుకే ఆన్‌లైన్, లోకల్ మార్కెట్లలో ఎక్కడ ప్రొడక్ట్స్ పరిక్షించినా అందులో ఫైబర్స్, పెల్లెట్స్, ఫ్రాగ్మెంట్స్​ల రూపంలో 0.1 నుంచి 5 మిల్లీ మీటర్ల సైజులో మైక్రో ప్లాస్టిక్ కనిపిస్తుందట.

నష్టాలివే..

కంటికి కనిపించని ఈ మైక్రో ప్లాస్టిక్ శరీరంలోకి వెళ్లడం ద్వారా పలు అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు హార్మోన్లపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఫలితంగా పలు దీర్ఘకాలిక సమస్యలకు కారణమవుతాయి.

మైక్రో ప్లాస్టిక్ కణాలు టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే రిస్క్‌ను కూడా పెంచుతాయి. అంతేకాదు ఈ కణాలు క్యాన్సర్ కణాలను కూడా ప్రేరేపిస్తాయి. శరీర ఇమ్యూనిటీని దెబ్బ తీసి శరీరంలో చెడు బ్యాక్టీరియా నిల్వలను పెంచుతాయి.

జాగ్రత్తలు ఇలా..

కల్తీ బారిన పడకుండా ఉండాలంటే ప్రొడక్ట్ ఎంచుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. అయోడైజ్డ్ ఉప్పుకి బదులు రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ వంటివి వాడితే మంచిది. అలాగే చక్కెరకు బదులు బెల్లం, పామ్ షుగర్ వంటివి వాడితే మంచిది. అలాగే ప్రొడక్ట్స్ వాడేముందు దాని నాణ్యతను చెక్ చేసి రెండోసారి కొనాలా? వద్దా? అన్న నిర్ణయం తీసుకోవాలి. గుడ్డిగా ప్రొడక్ట్స్ ఎంచుకోకూడదు.

First Published:  27 Aug 2024 5:14 AM GMT
Next Story