Telugu Global
Health & Life Style

వెనిగర్‌‌తో లాభాలెన్నో..

రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ని కలిపి తాగడం ద్వారా మహిళల్లో హార్మోన్‌ సమస్యలు తగ్గుతాయి. నెలసరి సమస్యలు, పీసీఓఎస్ లాంటి సమస్యలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది.

వెనిగర్‌‌తో లాభాలెన్నో..
X

చర్మ సౌందర్యం నుంచి ఆరోగ్యం వరకూ వెనిగర్‌‌తో బోలెడు లాభాలున్నాయంటున్నారు నిపుణులు. డైలీ లైఫ్‌లో వెనిగర్‌‌ను ఎలా ఉపయోగించొచ్చంటే.. రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ని కలిపి తాగడం ద్వారా మహిళల్లో హార్మోన్‌ సమస్యలు తగ్గుతాయి. నెలసరి సమస్యలు, పీసీఓఎస్ లాంటి సమస్యలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. వెనిగర్‌‌తో బరువు కూడా తగ్గొచ్చని ఎన్నో అధ్యయనాలు చెప్తున్నాయి. వెనిగర్‌‌ను నీటిలో కలుపుకొని లేదా ఆహారంలో కలిపి తీసుకుంటే ఆకలి తగ్గుతుంది. అలా వెనిగర్‌‌తో కేలరీల సంఖ్యను తగ్గించుకోవచ్చు. వెనిగర్‌‌తో చర్మం పొడిబారడం, ఎగ్జిమా వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. మొటిమల సమస్యకు కూడా వెనిగర్‌‌తో చెక్ పెట్టొచ్చు.

వెనిగర్‌‌లో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని ఆహారాన్ని నిల్వ చేయడంలో ఎక్కువగా వాడతారు. వెనిగర్ సూక్ష్మక్రిములతో పోరాడుతుంది. అందువ‌ల్ల‌ దీన్ని రోజూ తీసుకుంటే సాధారణ రుగ్మతలు, చర్మ సమస్యలు తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి కూడా వెనిగర్ ఎంతో మేలు చేస్తుంది. వెనిగర్‌తో రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు వెనిగర్‌‌ను రోజూ తీసుకోవాలి. వెనిగర్‌‌తో జీర్ణ సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. అజీర్తి, మల బద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తినప్పుడు ఓ గ్లాసులో టేబుల్‌ స్పూను ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ కలుపుకొని తాగితే ఉపశమనం ఉంటుంది. మార్కెట్లో ఎన్నో రకాల వెనిగర్‌‌లు దొరుకుతాయి. సేంద్రియ పద్ధతిలో తయారైన వెనిగర్‌‌ను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

First Published:  23 Aug 2022 7:46 AM GMT
Next Story