Telugu Global
Health & Life Style

ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చూస్తున్నారా?

డయాబెటిస్, గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాలు తీసుకోవాలంటున్నారు.

glycemic index in food
X

ఆరోగ్యంగంగా ఉండాలంటే ఆలస్యంగా జీర్ణమయ్యే పదార్థాలు తినాలంటున్నారు డాక్టర్లు. డయాబెటిస్, గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాలు తీసుకోవాలంటున్నారు.

మనం తీసుకునే ఆహారంలోని గ్లూకోజ్ ఎంత వేగంగా రక్తంలో కలుస్తుందనే దాన్ని గ్లైసిమిక్‌ ఇండెక్స్‌(జీఐ)తో లెక్కిస్తారు. వైట్ రైస్, బ్రెడ్, బంగాళా దుంపలు, స్వీట్స్ వంటివి ఎక్కువ గ్లైసెమిక్ ఉండే పదార్థాలు. ఇవి రక్తంలో గ్లూకోజ్ చాలా త్వరగా పెరిగేలా చేస్తాయి.

ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్, బ్రౌన్ రైస్, పొట్టుతీయని ధాన్యాలు, పప్పుల వంటివన్నీ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే పదార్థాలు. ఇవి నెమ్మదిగా రక్తంలో గ్లూకోజ్‌ను పెంచుతాయి. రక్తంలో త్వరగా గ్లూకోజ్ ను పెంచే పదార్థాలతో గుండెజబ్బులు, డయాబెటిస్ వంటి జబ్బుల ముప్పు పెరిగే ప్రమాదముంది.

అందుకే ఆలస్యంగా జీర్ణమవుతూ, రక్తంలో గ్లూకోజు నెమ్మదిగా కలిసేలా చేసే పదార్థాలు తినటం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఇక మాంసం, చికెన్‌, చేపల్లో ఎలాంటి పిండి పదార్థాలు ఉండవు కాబట్టి వాటిని తక్కువ మొత్తంలోతీసుకోవచ్చని చెప్తున్నారు.

శాస్త్రవేత్తలు ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో ప్రొటీన్, కొవ్వు పదార్థాలను యధావిధిగా తీసుకుంటూ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే పదార్థాలను తీసుకున్నవారిలో శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ), నడుం చుట్టుకొలత గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు. దీన్ని బట్టి అధిక బరువు, డయాబెటిస్, గుండెజబ్బులు ఉండేవారికి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని తేలింది.

First Published:  16 Aug 2022 8:30 AM GMT
Next Story