Telugu Global
Health & Life Style

ఈ అలవాట్లుంటే మొటిమలు రమ్మన్నా రావు!

చాలామందికి ముఖంపై మచ్చుకైనా ఒక్క మొటిమ కనిపించదు. అయితే దానికోసం వాళ్లు ప్రత్యేకంగా క్రీముల వంటివి వాడతారనకుంటే పొరపాటే. కేవలం కొన్ని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ పాటించడం ద్వారా మొటిమలు దరిచేరకుండా చూసుకోవచ్చు.

ఈ అలవాట్లుంటే మొటిమలు రమ్మన్నా రావు!
X

చాలామందికి ముఖంపై మచ్చుకైనా ఒక్క మొటిమ కనిపించదు. అయితే దానికోసం వాళ్లు ప్రత్యేకంగా క్రీముల వంటివి వాడతారనకుంటే పొరపాటే. కేవలం కొన్ని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ పాటించడం ద్వారా మొటిమలు దరిచేరకుండా చూసుకోవచ్చు. అదెలాగంటే..

ముఖంపై మొటిమలు రావడానికి నిర్లక్ష్యమే ప్రధాన కారణం. అంటే ముఖాన్ని సరిగా శుభ్రం చేసుకోకపోవడం, జిడ్డు తొలగించుకోకపోవడం వంటివన్న మాట. అందుకే ముఖం మీది చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం నిద్ర లేచిన తర్వాత, రాత్రి పడుకునే ముందు.. తప్పకుండా ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేస్తే.. ముఖంపై పేరుకున్న దుమ్ము, జిడ్డుదనం తొలగిపోయి చర్మ రంధ్రాలు తెరచుకుంటాయి. తద్వారా మొటిమలు రాకుండా చూసుకోవచ్చు.

మొబైల్‌ స్క్రీన్‌పై ఉండే క్రిములు టాయిలెట్స్‌లో కూడా ఉండవని స్టడీలు చెప్తున్నాయి. కాబట్టి మొబైల్‌ను చెంపకు ఆనించి కాల్స్ మాట్లాడే అలవాటుని మానుకోవాలి. మొబైల్‌ను తాకిన చేతులతో ముఖాన్ని తడుముకోకుండా జాగ్రత్తపడాలి. ఫోన్‌ స్క్రీన్‌ను ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటుండాలి. అలాగే పదే పదే ముఖాన్ని చేతులతో తాకే అలవాటు కూడా మానుకోవాలి.

ముఖం మీది చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే దిండు కవర్లు కూడా శుభ్రంగా ఉండాలి. పడుకున్నప్పుడు జుట్టు కుదుళ్లలో ఉన్న జిడ్డు దిండు కవర్ల పైకి చేరుతుంది. వారాల తరబడి అవే దిండు కవర్లను వాడడం వల్ల ఆ జిడ్డు, క్రిములు ముఖానికి అంటుకుంటాయి. తద్వారా మొటిమలు వస్తాయి. కాబట్టి దిండు కవర్లు, బెడ్ షీట్లు ఎప్పటికప్పుడు మారుస్తుండాలి.

కుదుళ్లలో ఉండే జిడ్డు క్రమంగా కిందికి జారి ముఖం వరకూ చేరుతుంటుంది. ఇది కూడా మొటిమలకు కారణమే. అందుకే వారానికి రెండు మూడు సార్లైనా తలస్నానం చేస్తుండాలి.

మొటిమలు రాకూడదంటే డైట్‌లో కాయగూరలు, తృణ ధాన్యాలు, పండ్లు, ఆకు కూరలు కూడా చేర్చుకోవాలి. నీళ్లు ఎక్కువ తాగాలి. కొంతమందికి పాలు తాగడం వల్ల కూడా మొటిమలు వస్తాయి. కాబట్టి మొటిమలు తగ్గకపోతుంటే పాలు మానేసి చూడాలి.

ఒబెసిటీ కూడా మొటిమలకు కారణమవుతుంది. కాబట్టి మొటిమలు రాకూడదంటే బరువు తగ్గించుకోవాలి. అలాగే మొటిమలు, మచ్చలు రావడానికి ఒత్తిడి కూడా ఓ కారణం. కాబట్టి వీలైనంత వరకూ ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం వంటివి చేయొచ్చు.

మేకప్ ప్రొడక్ట్స్‌ను ఇతరులతో షేర్ చేసుకోవడం, ఫేస్ వాష్ చేసుకోకపోవడం, పొల్యూషన్‌లో ఎక్కువ తిరగడం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినడం కూడా మొటిమలు రావడానికి కారణమవుతాయి. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తపడాలి.

First Published:  19 Aug 2023 6:30 AM GMT
Next Story