Telugu Global
Health & Life Style

పోశ్చర్ ఇలా ఉంటే ఇబ్బందులు తప్పవు!

రోజువారీ లైఫ్‌స్టైల్‌లో పడుకోవడం, కూర్చోవడం, నిల్చోవడం వంటి విషయాల్లో సరైన పోశ్చర్‌‌ను మెయింటెయిన్ చేయకపోవడం వల్లనే పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు.

పోశ్చర్ ఇలా ఉంటే ఇబ్బందులు తప్పవు!
X

రోజువారీ లైఫ్‌స్టైల్‌లో పడుకోవడం, కూర్చోవడం, నిల్చోవడం వంటి విషయాల్లో సరైన పోశ్చర్‌‌ను మెయింటెయిన్ చేయకపోవడం వల్లనే పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. పోశ్చర్ విషయంలో సాధారణంగా చాలామంది మిస్టేక్స్ చేస్తుంటారు. అవేంటంటే..

బాడీ పోశ్చర్‌‌ను కొద్దిగా సరిచేసుకోవడం ద్వారా చాలా రకాల నొప్పులకు, కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఉదాహరణకు పడుకునే సమయంలో మెడ కింద ఎత్తైన దిండుకి బదులు పలుచటి దిండుని వాడడం ద్వారా మెడనొప్పిని తగ్గించుకోవచ్చు. అలాగే పనిచేసేటప్పుడు వెన్నెముక కింది భాగాన్ని బ్యాక్ రెస్ట్‌కు ఆనించి కూర్చోవడం ద్వారా వెన్ను నొప్పి బారినపడకుండా చూసుకోవచ్చు.

పోశ్చర్ విషయంలో చేసే మరో మిస్టేక్ కాలు మీద కాలు వేసి కూర్చోవడం. సెలబ్రిటీలను చూసి చాలామంది కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అలవాటు చేసుకుంటారు. ఈ పోశ్చర్ వల్ల పైన ఉన్న కాలి తొడ, మోకాలు, పాదం వంటి భాగాలకు రక్తప్రసరణ తగ్గి తిమ్మిర్ల వంటివి పెరిగే అవకాశం ఉంటుంది.

కూర్చుని పనిచేసేటప్పుడు చాలామంది క్రమంగా వెనక్కి వాలిపోతూ నడుముని ముందుకి జరిపేస్తుంటారు. ఈ పోశ్చర్ వల్ల వెన్నెముక వంగిపోతుంది. ఈ భంగిమలో ఎక్కువసేపు ఉండడం ద్వారా వెన్నెముక కింది భాగంలో ఒత్తిడి పెరుగుతుంది.

ఇకపోతే చాలామందికి బోర్లా పడుకునే అలవాటు ఉంటుంది. బోర్లా పడుకోవడం వల్ల వెన్నుపూసపై ఒత్తిడి పెరుగుతుంది. ఊపిరి సరిగా ఆడదు. బోర్లా పడుకున్నప్పుడు మెడను నిటారుగా ఉంచడం కుదరదు. కాబట్టి ఒకవైపుకి తిప్పి పడుకోవాలి. దీనివల్ల మెడపై కూడా ఒత్తిడి పడుతుంది. అంతేకాదు, బోర్లా పడుకోవడం వల్ల జీర్ణాశయంపై కూడా ఒత్తిడి పడి తిన్నది సరిగా జీర్ణం కాకపోవచ్చు.

వీటితోపాటు తరచూ వేళ్లు విరుచుకోవడం, మెడను విరచడం, మెడను కిందికి వంచి ఎక్కువసేపు చూడడం, కదలకుండా కూర్చోవడం, కాళ్లు ఊపడం, ముందుకి వంగి బైక్ నడపడం వంటివి కూడా బ్యాడ్ పోశ్చర్స్ కిందికి వస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు పోశ్చర్‌‌ను సరి చూసుకుంటూ వెన్నెముక, మెడ, కాళ్లు, చేతులు రిలాక్స్‌డ్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి.

First Published:  18 Jan 2024 7:30 AM GMT
Next Story