Telugu Global
Health & Life Style

ఊపిరితిత్తుల వ్యాధి ఉంటే.. మీ చర్మం సంకేతాలు చూపిస్తుంది.. అది ఎలా అంటే

ఊపిరితిత్తులు ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే.. మన చర్మం దాని గురించి సూచిస్తుంది. అవి ఏంటో ఒక సారి గమనిద్దాం.

ఊపిరితిత్తుల వ్యాధి ఉంటే.. మీ చర్మం సంకేతాలు చూపిస్తుంది.. అది ఎలా అంటే
X

మనకు పైన కనిపించే చర్మం.. శరీరంలోని అనేక వ్యాధులకు సంబంధించిన సంకేతాలను చూపిస్తుందని తెలుసా? చర్మంపై వచ్చే మచ్చలు, కురుపులు, మొటిమలు కేవలం చర్మ వ్యాధులకు సంబంధించింనవే కాదు.. మన శరీరంలోని ఏదో ఒక అవయవం సరిగా పని చేయడం లేదని కూడా అర్థం. మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో ఒకటైన ఊపిరితిత్తులు అనారోగ్యానికి గురైతే.. దాని సంకేతాలను చర్మం చూపిస్తుంది.

ఊపిరితిత్తులు మనం పడుకున్నా, మేల్కొన్నా పని చేస్తూనే ఉంటాయి. ఆరోగ్యకరమైన మనిషి రోజుకు దాదాపు 20 వేల సార్లు ఊపిరి తీసుకుంటాడని నిపుణులు చెబుతున్నారు. 50 ఏళ్లు పూర్తయిన మనిషి ఊపిరితిత్తులు దాదాపు 400 మిలియన్ సార్లు ఊపిరి తీసుకొని ఉంటాయి. మన శరీరానికి అవసరమైన ఆక్సిజన్ లంగ్స్ ద్వారానే వస్తుంది. కాబట్టి అవి అనారోగ్యానికి గురైతే అనేక సమస్యలు తలెత్తుతాయి. ఊపిరితిత్తులు ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే.. మన చర్మం దాని గురించి సూచిస్తుంది. అవి ఏంటో ఒక సారి గమనిద్దాం.

నీలి రంగు చర్మం:

మన చర్మం అకస్మాతుగా నీలం లేదా ఊదా రంగులోకి మారితే అది ఊపిరితిత్తుల వ్యాధికి తొలి సంకేతమని వైద్యులు చెబుతున్నారు. చర్మం రంగు మారితే తేలికగా తీసుకోవద్దని అంటున్నారు. చర్మం రంగు మారడాన్ని వైద్య పరిభాషలో సైనోసిస్ అంటారు. దీర్ఘకాలం చర్మం రంగు అలాగే ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచింది.

ఎరుపు రంగు మచ్చలు:

చర్మంపై ఎరుపు రంగు మచ్చలు కూడా ఊపిరితిత్తుల వ్యాధికి సంకేతమే. ఈ ఎరుపు రంగు మచ్చల వ్యాధిని సార్కొయిడోసిస్ అంటారు. చీలమండ, దిగువ కాలు, చెంప, చెవి దగ్గర ఇలాంటి మచ్చలు కనిపిస్తాయి. ఆ సమయంలో లంగ్స్ పరీక్ష తప్పకుండా చేయించుకోవాలి.

వేళ్ల సమస్యలు:

చేతి, కాళ్లి వేళ్ల చర్మంలో మార్పులు వచ్చినా.. అవి దృఢత్వాన్ని కోల్పోయినట్లు అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. సాధారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, క్షయ, లంగ్స్‌లో చీము, బ్రోన్కియాక్టసిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధికి ఇది సంకేతం. ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ వల్ల కూడా కాలి, చేతి వేళ్ల చర్మంలో మార్పులు వస్తాయి.

ముఖంపై చెమట:

సాధారణం కంటే మన ముఖంపై చర్మం ఎక్కువ చెమటను విడుదల చేస్తుంటే తప్పకుండా అప్రమత్తం కావాలి. ముఖం, తల, తలపై ఎక్కువగా చెమట పట్టడం క్యాన్సర్‌కు ప్రధాన సంకేతం. వైద్య పరిభాషలో దీన్ని క్రానియోఫేషియల్ హైపర్ హైడ్రోసిస్ అని అంటారు.

ఛాతిపై మొటిమలు:

ఛాతి పైభాగంలో మొటిమలు వస్తుంటే అది కచ్చితంగా ఊపిరితిత్తుల అనారోగ్యాన్ని సూచిస్తుంది. లంగ్స్ పూర్తి ఆరోగ్యంగా లేనప్పుడు ఛాతిపై మొటిమలు రావడం, ఎగువ సిర సంకుచితంగా మారడం వల్ల రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి. ఈ సిర సాధారణంగా డీఆక్సిజనేటెడ్ రక్తాన్ని కుడివైపునకు తీసుకొని వస్తాయి.

కనురెప్పల బలహీనత:

బలహీనమైన కనురెప్పలు, వాటిపై చిన్న మొటిమలు కూడా క్యాన్సర్‌కు సంబంధించిన సంకేతాలే. ముఖ్యంగా ఇది ఊపిరితిత్తుల ఎగువ భాగంలో వచ్చే పాన్‌కోస్ట్ ట్యూమర్ లేదా క్యాన్సర్‌కు సంకేతం. ఇలాంటి సమయంలో కళ్లు, ముఖం యొక్క నరాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి.

First Published:  13 Dec 2022 12:53 PM GMT
Next Story