Telugu Global
Health & Life Style

సక్సెస్ అవ్వడం కోసం మైండ్‌కు ఇలా ట్రైనింగ్ ఇవ్వండి!

ఏ విషయంలోనైనా సక్సెస్ అనేది ఆ వ్యక్తి మైండ్‌సెట్ మీదనే ఆధారపడి ఉంటుందన్నది నిపుణులు చెప్పే మాట. మైండ్ సెట్‌ను ఒక నిర్ధిష్ట క్రమంలో ఉంచుకోవడం ద్వారా ఎలాంటి లక్ష్యాలనైనా ఈజీగా చేరుకోవచ్చంటున్నారు మానసిక నిపుణులు. సక్సెస్ కోసం మైండ్ ట్రైనింగ్ ఎలా ఉండాలంటే..

సక్సెస్ అవ్వడం కోసం మైండ్‌కు ఇలా ట్రైనింగ్ ఇవ్వండి!
X

ఏ విషయంలోనైనా సక్సెస్ అనేది ఆ వ్యక్తి మైండ్‌సెట్ మీదనే ఆధారపడి ఉంటుందన్నది నిపుణులు చెప్పే మాట. మైండ్ సెట్‌ను ఒక నిర్ధిష్ట క్రమంలో ఉంచుకోవడం ద్వారా ఎలాంటి లక్ష్యాలనైనా ఈజీగా చేరుకోవచ్చంటున్నారు మానసిక నిపుణులు. సక్సెస్ కోసం మైండ్ ట్రైనింగ్ ఎలా ఉండాలంటే..

అనుకున్నది జరగకపోతే దానికి బయట పరిస్థితులు కారణాలుగా చూస్తూ చాలామంది డిప్రెషన్‌లోకి వెళ్తుంటారు. కానీ, సక్సెస్ అనేది బయట పరిస్థితుల కంటే మానసిక సామర్థ్యం మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. దీనికోసం మెదడుకి కొంత ట్రైనింగ్ ఇవ్వాలి..

సక్సె్స్ అవ్వాలంటే భయపడకుండా దైన్నైనా స్వీకరించే గుణం ఉండాలి. మెదడుకి ఈ రకమైన ట్రైనింగ్ ఇస్తూ అన్ని పరిస్థుతుల్లో పాజిటివ్‌గా ఉండేలా అలవాటు చేయాలి. ఇలా చేస్తే ఎలాంటి కష్టతరమైన పరిస్థితుల్లోనైనా మైండ్ గివప్ ఇవ్వకుండా ఛాలెంజ్‌గా స్వీకరించి వాటిని పూర్తి చేయగలుగుతుంది.

మెదడు సమర్థవంతంగా పనిచేయడం కోసం దానికి రిలాక్స్ అయ్యేందుకు టైం ఇవ్వాలి. దీనికోసం ప్రశాతంగా నిద్రపోవడం, మెడిటేషన్ చేయడం వంటివి చేయొచ్చు. మెదడుని ఏరోజుకారోజు రిలాక్స్ చేస్తేనే అది మరింత ఉత్సాహంతో పనిచేయగలగుతుంది. మెడిటేషన్ వంటివి చేయడం ద్వారా ఏకాగ్రత పెరిగి, ఎమోషన్స్ కంట్రోల్‌లో ఉంటాయి.

మనసులో నెగెటివ్ ఆలోచనలు మొదలైతే మెదడు వెంటనే డీలా పడిపోతుంది. కాబట్టి కుం నిరాశ, నిస్పృహల వంటివి దరిదాపుల్లోకి రాకుండా మెదడుకి ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రతి పరిస్థితిని అనుకూలంగా చూసేలా పాజిటివిటీని అలవాటు చేయాలి.

దేన్నైనా క్షుణ్ణంగా పరిశీలించే గుణాన్ని మెదడుకి అలవాటు చేయాలి. ప్రతి విషయాన్ని సునిశితంగా పరిశీలించడం ద్వారా సమస్య ఎందుకొస్తుందో మెదడు తెలుసుకోగలుగుతుంది. తద్వారా మెరుగైన ఆలోచనలు చేయగలుగుతుంది. తెలివితేటలు మెరుగుపడతాయి.

సక్సెస్ అవ్వాలంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకునేలా మెదడుకి ట్రైనింగ్ ఇవ్వాలి. కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా మెదడు పనితీరు మరింత ఇంప్రూవ్ అవుతుంది. మెమరీ పవర్ పెరుగుతుంది. బోరింగ్ వంటి ఫీలింగ్స్‌కు అవకాశం ఉండదు.

ఇక వీటితోపాటు నీళ్లు ఎక్కువ తాగడం, హెల్దీ ఫుడ్ తీసుకోవడం, తగినంత నిద్రపోవడం వంటివి కూడా మెదడు పనితీరుని ప్రభావితం చేస్తాయి.

First Published:  15 Jan 2024 8:30 AM GMT
Next Story