Telugu Global
Health & Life Style

డయాబెటిస్ రివర్స్ చేయండిలా..

జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే డయాబెటిస్ ను అటుంచితే.. లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్ వల్ల వచ్చే డయాబెటిస్ కేసులే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంటున్నాయని డాక్టర్లు చెప్తున్నారు.

డయాబెటిస్ రివర్స్ చేయండిలా..
X

డయాబెటిస్ రివర్స్ చేయండిలా..

జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే డయాబెటిస్ ను అటుంచితే.. లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్ వల్ల వచ్చే డయాబెటిస్ కేసులే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంటున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. అయితే కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తే డయాబెటిస్‌ను కొంతవరకూ రివర్స్‌ చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అదెలాగంటే..

శరీరానికి అవసరమైనదానికంటే ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల శరీరంలో గ్లూకోజ్‌ అదనంగా చేరుతుంది. ఇలా ఎక్స్‌ట్రాగా వచ్చి చేరిన గ్లూకోజ్ కొవ్వు రూపంలో కాలేయం, జీర్ణాశయం వంటి ప్రాంతాల్లో పేరుకుపోతుంది. ఈ అదనపు గ్లూకోజ్‌ను గమనించిన శరీర కణాలు- తమకు అంత శక్తి అవసరం లేదని పాంక్రియాస్‌కు సంకేతాలిస్తాయి. దాంతో అది ఇన్సులిన్‌ రిలీజ్‌ చేయడం తగ్గిస్తుంది. దాంతో శరీరంలోకి షుగర్ కంటెంట్ వచ్చినప్పుడు రక్తంలో గ్లూకోజ్‌ విలువలు అమాంతం పెరిగిపోతాయి. దీన్నే డయాబెటిస్‌గా పరిగణిస్తారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు నిర్ధిష్టమైన డైట్, లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్ పాటించడం ద్వారా శరీరంలోని గ్లూకోజ్ లెవల్స్‌ను తిరిగి కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు.

డయాబెటిస్ ఉన్నవాళ్లు ముందుగా గుర్తుంచుకోవాల్సింది మితమైన ఆహారం. అవసరమైన దాన్ని కన్నా ఎక్కువ తినకుండా జాగ్రత్తపడాలి. ఏ ఆహారం తింటే గ్లూకోజ్‌ విలువలు పెరుగుతాయో తెలుసుకుని వాటిని తగ్గించాలి. కార్బోహైడ్రేట్స్‌ను పూర్తిగా మానేయడం పరిష్కారం కాదు. దానికి బదులు ఫైబర్ ఎక్కువగా ఉండే మిల్లెట్స్‌ను తినొచ్చు. అలాగే ప్రొటీన్, ఫ్యాట్స్ ను కూడా బ్యాలెన్స్ చేస్తుండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీనివల్ల శరీరంలో క్యాలరీలు కరుగుతాయి.

డయాబెటిస్ ఉన్నవాళ్లు షుగర్ లెవల్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండడం చాలా ముఖ్యం. అలాగే షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసే మెంతులు, కాకరకాయ, నట్స్, గ్రీన్ టీ, దాల్చిన చెక్క, పసుపు, బెర్రీస్, ఆలివ్ ఆయిల్, బ్రకొలి, చేపలు వంటివి తీసుకుంటుండాలి.

షుగర్ పేషెంట్లు నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా రక్తంలోని గ్లూకోజ్‌ లెవల్స్ పలుచబడి కంట్రోల్‌లో ఉంటాయి. అలాగే వీళ్లు చక్కెర, కెఫీన్‌, ఆల్కహాల్‌, స్మోకింగ్ కు దూరంగా ఉండడం అవసరం.

ఇక అన్నింటిముఖ్యంగా డయాబెటిస్ గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. సమస్య గురించి పదేపదే ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరిగి సమస్యను మరింత ఎక్కువ చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకూ ఒత్తిడి లేకుండా సంతోషంగా జీవించే ప్రయత్నం చేయాలి. మానసికంగా సమస్యను తగ్గించుకోగలిగితే శారీరకంగా కూడా మార్పు సంభవిస్తుందనేది నిపుణుల మాట.

First Published:  18 Nov 2023 7:59 AM GMT
Next Story