Telugu Global
Health & Life Style

మాయిశ్చరైజర్ తయారుచేసుకోండిలా..

Homemade Moisturizer For winter in Telugu: చలికాలంలో చర్మానికి అదనపు తేమ అవసరం. దానికోసం రోజూ మాయిశ్చరైజర్ అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే చర్మం రకాన్ని మాయిశ్చరైజర్‌‌ను సింపుల్‌గా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు

మాయిశ్చరైజర్ తయారుచేసుకోండిలా..
X

చలికాలంలో చర్మానికి అదనపు తేమ అవసరం. దానికోసం రోజూ మాయిశ్చరైజర్ అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే చర్మం రకాన్ని మాయిశ్చరైజర్‌‌ను సింపుల్‌గా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చని మీకు తెలుసా?

50 మి.లీ. ఆలివ్‌ నూనెకు 2 చెంచాల పాలు, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపితే మాయిశ్చరైజర్ రెడీ అవుతుంది. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి మూడురోజుల వరకూ వాడుకోవచ్చు. దీన్ని దూదితో ముఖం, కాళ్లు, చేతులకు రాస్తే చర్మం పాడవ్వకుండా ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవాళ్లకి ఇది బాగా సూట్ అవుతుంది. ఆలివ్‌ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలెక్కువ. చర్మానికి పోషణను అందిస్తుంది. నిమ్మరసం జిడ్డును పోగొడుతుంది. అలాగే పాలలోని లాక్టిక్‌ ఆసిడ్‌ చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

అరకప్పు కొబ్బరినూనెకు కొద్దిగా విటమిన్‌ ఇ నూనె, లావెండర్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ కొన్ని చుక్కలు కలిపితే మరొక మాయిశ్చరైజర్ రెడీ. పొడి చర్మం ఉన్నవారికి ఇది బాగా పనికొస్తుంది. కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది. విటమిన్‌ ఈ లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మకణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.

ఆర్గాన్‌ ఆయిల్‌ను కూడా మాయిశ్చరైజర్‌‌గా వాడుకోవచ్చు. మొటిమలు ఉన్నవారికి ఇది బెస్ట్. రోజూ రాత్రి ఆర్గాన్ ఆయిల్ ముఖానికి పట్టించి, ఉదయాన్నే గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ముఖం మీది చర్మం తాజాగా ఉంటుంది. ఇక వీటితోపాటు రోజ్ వాటర్, కలబంద లాంటివి కూడా మాయిశ్చరైజర్లుగా వాడుకోవచ్చు.

First Published:  6 Nov 2022 7:00 AM GMT
Next Story