Telugu Global
Health & Life Style

మగవాళ్లలో తగ్గుతున్న స్పెర్మ్ కౌంట్! ఎలా పెంచుకోవచ్చంటే..

ప్రపంచవ్యాప్త పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందని పలు అంతర్జాతీయ నివేదికలు చెప్తున్నాయి. ఈ సమస్య మనదేశంలో కూడా ఎక్కువగానే ఉంది. స్పెర్మ్ కౌంట్ అంటే వీర్య కణాల సంఖ్య.

sperm count
X

మగవాళ్లలో తగ్గుతున్న స్పెర్మ్ కౌంట్! ఎలా పెంచుకోవచ్చంటే..

ప్రపంచవ్యాప్త పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందని పలు అంతర్జాతీయ నివేదికలు చెప్తున్నాయి. ఈ సమస్య మనదేశంలో కూడా ఎక్కువగానే ఉంది. స్పెర్మ్ కౌంట్ అంటే వీర్య కణాల సంఖ్య. ఇవి తగ్గిపోవడం వల్ల ఫెర్టిలిటీ సమస్యలు తలెత్తుతాయి. స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి కాలుష్యం నుంచి ఆహారం వరకూ చాలా కారణాలున్నాయి. ఈ సమస్యను ఎలా ఎదర్కోవాలంటే..

స్పెర్మ్ కౌంట్ అనేది ఆహారం, లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్, పర్యావరణం, పరిసరాల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం ఎక్కువవ్వడం వల్ల దాని ఎఫెక్ట్ పురుషులపై పడుతుందని సర్వేలు చెప్తున్నాయి. ప్లాస్టిక్‌లో విషపూరిత రసాయనాలతో పాటు 'బిస్ఫినాల్‌' అనే ప్రమాదకరమైన రసాయనం ఉంటుంది. ఈ రసాయనం శరీరంలోని హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. పురుషుల్లో టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఉత్పత్తి క్షీణించేలా చేస్తుంది. ఫలితంగా వీర్యకణాల సంఖ్య తగ్గుతోంది.ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లు, టీ, కాఫీ కప్పులు, కర్రీ పాయింట్లలో వాడే ప్లాస్టిక్‌ కవర్లు.. వీటన్నింట్లో బిస్ఫినాల్‌ ఉంటుంది. వేడి తగిలినప్పుడు, వాటిలోని ఈ బిస్ఫినాల్‌ కరిగి పదార్థాల్లో కలిసి, మన శరీరాల్లోకి చేరుతుంది. వీటితో పాటు పంటల్లో పురుగుమందులు వాడడం, కల్తీ ఆహారం, కల్తీ మాంసం లాంటివి కూడావల్ల కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి కారణాలు.

మగవాళ్లు గాలి చొరబడని బిగుతైన జీన్స్‌ ప్యాంట్లు ఎక్కువగా వాడడం వల్ల కూడా వీర్యకణాల ఉత్పత్తి తగ్గుతుందని డాక్టర్లు చెప్తున్నారు. అలాగే ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం, ఒడిలో ల్యాప్‌టాప్‌ పెట్టుకుని పని చేయడం, తరచుగా బైక్‌ మీద ప్రయాణించడం, సిగరెట్లు తాగడం లాంటి అలవాట్లు కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి ముఖ్య కారణాలు.

వీళ్లలో ఎక్కువ

గనులు, పరిశ్రమల్లో వేడిలో పనిచేసేవాళ్లు, వంట గదుల్లో ఎక్కువ సమయం గడిపే వాళ్లు, సెల్ టవర్లకు దగ్గరగా నివసిస్తుననవాళ్లు, షిఫ్ట్ జాబ్స్ చేసే వాళ్లు, హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్లలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయే ప్రమాదముందని నిపుణలు హెచ్చరిస్తున్నారు.

ఇలా పెంచుకోవచ్చు

స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే పోషకాల లోపం లేకుండా చూసుకోవాలి. కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగి తినాలి. గాలి చొరబడే ప్యాంట్లు, లోదుస్తులు ధరించాలి. ప్లాస్టిక్‌ ప్యాకెట్లు, కవర్లు, బాటిళ్ల వాడకం పూర్తిగా మానేయాలి. రోజుకి ఆరు నుంచి ఎనిమిది గంటలకు సరిపడా నిద్ర పోవాలి.

గుడ్లు, పాలకూర, అరటి పండ్లు, వాల్‌నట్స్‌, చేపలు. గుమ్మడి గింజలు, బార్లీ, చిక్కుళ్లు, మాంసం, దానిమ్మ, టొమోటో, డార్క్ చాక్లెట్ లాంటివి తింటుండాలి.

Next Story