Telugu Global
Health & Life Style

హెల్దీగా బరువు తగ్గించే మెడిటరేనియన్ డైట్.. ఎలా పాటించాలంటే..

బరువు తగ్గాలనుకునేవారికి రకరకాల డైట్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో మెడిటరేనియన్ డైట్ అనే మాట చాలా చోట్ల వినిపిస్తుంది.

Mediterranean diet for weight loss
X

మెడిటరేనియన్ డైట్

బరువు తగ్గాలనుకునేవారికి రకరకాల డైట్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో మెడిటరేనియన్ డైట్ అనే మాట చాలా చోట్ల వినిపిస్తుంది. చాలామంది డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు ఈ డైట్ ఫాలో అవ్వమని సజెస్ట్ చేస్తున్నారు. ఇతర డైట్స్‌లా కాకుండా ఇది తక్కువ కాలంలోనే మంచి రిజల్ట్స్ ఇస్తుందంటున్నారు. ఇది ఎలా ఉంటుందంటే..

మెడిటరేనియన్ డైట్ అంటే మధ్యధరా ఆహారం అని అర్థం. ఇది మధ్యధరా సముద్రం సమీపంలో నివసించే ప్రజల ఆహారపు అలవాట్ల నుంచి వచ్చింది. ఇది ప్లాంట్ బేస్డ్ డైట్. అంటే ఇందులో పండ్లు, కూరగాయలు, గింజలు లాంటివే ఉంటాయి.

ఈ డైట్ పాటించాలనుకునే వాళ్లు ప్లాంట్ బేస్డ్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. ఈ డైట్‌లో ముఖ్యంగా.. ఆకుకూరలు, కాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రొకలీ, క్యారెట్, బీట్ రూట్, మొలకలు, బంగాళాదుంపలు, చిలగడదుంపలు , టొమాటో వంటి కూరగాయలను తీసుకోవాలి. అలాగే -ఆపిల్, అరటి, నారింజ, బెర్రీస్ ద్రాక్ష వంటి పండ్లు కూడా తీసుకోవచ్చు. వీటితో పాటు- బీన్స్, బఠానీలు, మొక్కజొన్న, చిక్కుళ్లు, బార్లీ, బియ్యం.. ఇలా అన్ని రకాల గింజలు, విత్తనాలు తినాలి. కొవ్వులు కావాలనుకునేవాళ్లు ఆలివ్ నూనె, చేపలు వంటివి కూడా తినొచ్చు.

బరువు తగ్గొచ్చు

ఈ డైట్‌లో ఎక్కువ శాతం మొక్కల నుంచి వచ్చిన ఆహారాలే ఉంటాయి. కాబట్టి శరీరానికి ఎక్కువ క్యాలరీలు అందే అవకాశం లేదు. ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తినడం వల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు అందుతాయి. పప్పులు, నట్స్ నుంచి ప్రొటీన్స్, గింజల నుంచి ఫైబర్, పండ్లు, కూరగాయల నుంచి విటమిన్లు ఇతర పోషకాలు లభిస్తాయి. ఈ డైట్ పాటించడం వల్ల బరువు పెరిగే అవకాశం లేకపోగా క్రమంగా బరువు తగ్గే వీలుంటుంది.

ఈ డైట్‌లో కొవ్వులు తక్కువగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్‌ సమస్య ఉండదు. గుండె సమస్యలు తగ్గుతాయి . ఈ డైట్‌లో సోడియం కంటెంట్ కూడా తక్కువగానే ఉంటుంది. కాబట్టి రక్తపోటు కూడా తగ్గుతుంది. ఈ డైట్ పాటించాలనుకునేవాళ్లు వాళ్ల అవసరాలను బట్టి ఒకసారి డాక్టర్‌‌ను కలిసి ఏ ఫుడ్ ఎంత మోతాదులో తినాలి అనేది నిర్ణయించుకోవచ్చు.

First Published:  1 Feb 2023 5:50 AM GMT
Next Story