Telugu Global
Health & Life Style

ముడతలను పోగొట్టే స్కిన్ సైక్లింగ్.. ఎలా చేయాలంటే..

వయసు పైబడే కొద్దీ చాలామందిలో ముఖంపై ముడతలు కనిపిస్తుంటాయి. అయితే రోజువారీ మేకప్‌తో వీటికి చెక్ పెట్టడం కష్టం.

Skin cycling: ముడతలను పోగొట్టే స్కిన్ సైక్లింగ్.. ఎలా చేయాలంటే..
X

ముడతలను పోగొట్టే స్కిన్ సైక్లింగ్.. ఎలా చేయాలంటే..

వయసు పైబడే కొద్దీ చాలామందిలో ముఖంపై ముడతలు కనిపిస్తుంటాయి. అయితే రోజువారీ మేకప్‌తో వీటికి చెక్ పెట్టడం కష్టం. దానికి విరుద్ధంగా స్కిన్‌కు కాస్త రెస్ట్ ఇస్తే వృద్ధాప్య ఛాయల నుంచి బయటపడొచ్చంటున్నారు స్కిన్ కేర్ నిపుణులు.

చాలామంది అమ్మాయిలు టీనేజ్ వయసు నుంచి స్కిన్ కేర్ రొటీన్‌ను ఫాలో అవుతుంటారు. ఫౌండేషన్, మాయిశ్చరైజర్, ఇతర క్రీముల లాంటివి వాడుతుంటారు. అయితే వయసు ముప్ఫై దాటిన తర్వాత స్కిన్ కేర్ రొటీన్‌కు రెస్ట్ ఇవ్వాలంటున్నారు నిపుణులు. దీన్నే 'స్కిన్‌ సైక్లింగ్‌' అంటున్నారు. దీనివల్ల చర్మం తనంతట తానే రిపేర్‌ చేసుకుని తాజాగా కనిపిస్తుందట. ఈ స్కిన్ సైక్లింగ్ ఎలా చేయాలంటే..

స్కిన్ సైక్లింగ్ అనేది రోజు విడిచి రోజు చేసే ఓ పద్ధతి. ముందుగా మొదటి రోజు 'ఎక్స్‌ఫోలియేషన్‌' చేసుకోవాలి. అంటే క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత నచ్చిన స్క్రబ్‌ను ఎంచుకొని ఐదు నిమిషాలపాటు ముఖాన్ని సున్నితంగా రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసి, తడి ఆరిపోయాక మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో పేరుకున్న మృతకణాలు తొలగిపోతాయి.

ఎక్స్‌ఫోలియేషన్ తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి మూడో రోజు ముఖానికి 'రెటినాయిడ్' సీరమ్ అప్లై చేయాలి. ముఖాన్ని క్లెన్సర్‌తో శుభ్రం చేసుకొని తడి పూర్తిగా ఆరాక విటమిన్‌ ఎ పుష్కలంగా ఉండే రెటినాయిడ్‌ సీరమ్‌ ముఖానికి రాయాలి. ఇది మొటిమల మచ్చలు, ముడతలు వంటి వాటిని పోగొడుతుంది.

రెటినాయిడ్ సీరమ్ తర్వాత మరో రోజు గ్యాప్ ఇచ్చి ఐదో రోజు 'రికవరీ' ప్రాసెస్ మొదలుపెట్టాలి. రికవరీ అంటే ముఖాన్ని శుభ్రం చేసుకుని కేవలం నేచురల్ మాయిశ్చరైజర్ అంటే.. కలబంద, తేనె, సన్ ఫ్లవర్ నూనె లాంటివి రాసుకోవాలి. ఇది చర్మానికి తేమతోపాటు పోషణని అందిస్తుంది. చర్మం తేమగా, తాజాగా మారేలా చేస్తుంది. ఈ స్కిన్ సైక్లింగ్‌ను నెలకోసారి చేసుకుంటూ ఉండొచ్చు.

First Published:  5 Dec 2022 6:48 AM GMT
Next Story